Fruits : ప్ర‌తి రోజూ క‌నీసం ఏదో ఒక పండును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Fruits : మ‌నం ర‌క‌ర‌కాల పండ్ల‌ను మ‌న ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పండ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. పండ్లల్లో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ద‌రి చేర‌కుండా ఉంటుంది. పోష‌కాల లోపం రాకుండా ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అయితే ప్ర‌తిరోజూ ఏదో ఒక పండును త‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. ప్ర‌తిరోజూ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. అస‌లు ప్ర‌తిరోజూ పండ్ల‌ను ఎందుకు తీసుకోవాలి.. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పండ్ల‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం, మొల‌లు వంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. అదే విధంగా ప్ర‌తిరోజూ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. పండ్ల‌ల్లో ఉండే ప్లేవ‌నాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను, ట్రై గ్లిజ‌రాయిడ్స్ ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం బ‌రువు పెర‌గ‌కుండా ఉండ‌గ‌ల‌ము. అలాగే ప్ర‌తిరోజూ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన‌న్ని పోష‌కాలు ల‌భిస్తాయి. కొన్ని ర‌కాల పోష‌కాల‌ను మ‌నం ప్ర‌తిరోజూ శ‌రీరానికి అందిచాల్సి ఉంటుంది. క‌నుక పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం కోల్పోయిన పోష‌కాల‌ను తిరిగి అందిచ‌వ‌చ్చు.

Fruits take daily at least one of it for many benefits
Fruits

పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం శుభ్ర‌ప‌డుతుంది. శ‌రీరంలో ఉండే మ‌లినాలు, విష ప‌దార్థాలు తొల‌గిపోతాయి. కాలేయం, మూత్ర‌పిండాలు, ఊపిరితిత్తులు వంటి ముఖ్య‌మైన అవ‌య‌వాలు శుభ్ర‌ప‌డ‌తాయి. పండ్లల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీరాన్ని శుభ్ర‌ప‌ర‌చ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. అదే విధంగా ప్ర‌తిరోజూ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వీటిలో ఉండే ప్లేవనాయిడ్స్, పాలీఫినాల్స్ ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగుప‌రుస్తాయి. దీంతో చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ప్ర‌తిరోజూ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఈ ప్ర‌యోజ‌నాల‌న్నింటిని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు. క‌నుక ప్ర‌తిరోజూ పండ్ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం అల‌వాటు చేసుకోవాల‌ని వారు చెబుతున్నారు.

Share
D

Recent Posts