Garlic With Honey : మనలో చాలా మంది ఎటువంటి పని చేయనప్పటికీ త్వరగా అలసిపోతుంటారు. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల కూడా ఇలా చాలా త్వరగా అలసిపోతుంటారు. చక్కటి ఆరోగ్యానికి బలమైన వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా అవసరం. వ్యాధి నిరోధక వ్యవస్థ క్షీణించడం వల్ల రకరకాల అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. ఈ వ్యాధి నిరోధక శక్తిని మన ఇంట్లో ఉండే సహజసిద్దమైన పదార్థాలను ఉపయోగించి కూడా పెంచుకోవచ్చు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో వెల్లుల్లి మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వెల్లుల్లిని తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. వెల్లుల్లితో వ్యాధి నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం మనం వెల్లుల్లి పేస్ట్ ను, తేనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బల పేస్ట్ ను, రెండు టేబుల్ స్పూన్ల తేనెను వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఈ విధంగా వారం రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
అదేవిధంగా తేనె, వెల్లుల్లి మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు. రక్తనాళాలల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించి రక్త సరఫరా సాఫీగా చేయడంలో కూడా వెల్లుల్లి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల గొంతు నొప్పి సమస్య నుండి బయటపడవచ్చు. వెల్లుల్లిలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. జీర్ణాశయానికి సంబంధించిన ఎటువంటి వ్యాధినైనా తగ్గించే శక్తి వెల్లుల్లికి ఉంది. వెల్లుల్లి తేనె మిశ్రమం కలిపి తీసుకోవడం వల్ల డయేరియా తగ్గు ముఖం పడుతుంది.
ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ ఫెక్షన్ లను తగ్గేలా చేస్తాయి. తేనె, వెల్లుల్లి మిశ్రమాన్ని రోజూ తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి వాటిని నివారించుకోవచ్చు. శరీరంలోని వ్యర్థ పదార్థాలను కూడా వెల్లుల్లి బయటకు పంపిస్తుంది. రోజూ ఉదయం పరగడుపున రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల కూడా మనం చక్కటి ఫలితాలను పొందవచ్చు. వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. కాలేయం పనితీరును మెరుగుపరిచే రసాయనాలు వెల్లుల్లిలో అధికంగా ఉన్నాయి. వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన వంటివి దూరమవుతాయి.
వెల్లుల్లిని రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. ఈ విధంగా వెల్లుల్లిని, తేనెను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడంతోపాటు ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.