Giloy Turmeric Water : తిప్ప‌తీగ‌ను వారంలో 3 సార్లు ఇలా తీసుకోండి.. చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి..!

Giloy Turmeric Water : తిప్ప తీగ‌.. మ‌న‌లో చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది. అనేక ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌ల్లో ఇది కూడా ఒక‌టి. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదంలో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఔష‌ధంగా దీనిని ఉప‌యోగిస్తూ ఉంటారు. తిప్ప‌తీగ జ్యూస్, పౌడ‌ర్ రూపంలో మ‌న‌కు బ‌య‌ట ల‌భిస్తూ ఉంటుంది. చాలా మంది దీనిని ఔష‌ధంగా తీసుకుంటూ ఉన్నారు. అయితే కేవ‌లం తిప్ప‌తీగ జ్యూస్ ను తీసుకోవ‌డానికి బ‌దులుగా తిప్ప‌తీగ మ‌రియు పసుపును క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. తిప్ప తీగ మ‌రియు ప‌సుపు రెండూ కూడా ఎన్నో ఔష‌ధ గుణాల‌ను, ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉన్నాయి.

వీటిని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రింత చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. తిప్ప తీగ మ‌రియు ప‌సుపు నీటిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. దీని కోసం ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక ఇందులో మిరియాల పొడి, ప‌సుపు, దాల్చిన చెక్క‌, అల్లం తురుము, తిప్ప తీగ పొడి, పుదీనా ఆకులు వేసి వేడి చేయాలి. ఈ నీటిని మ‌రో నిమిషం పాటు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న నీటిని వ‌డ‌క‌ట్టి తీసుకోవాలి. ఈ నీటిని ఒక కప్పు మోతాదులో వారానికి 3 సార్లు తీసుకోవ‌డం వల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఇలా తిప్ప‌తీగ మ‌రియు ప‌సుపు క‌లిపిన నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్పెక్ష‌న్ లు, జ‌బ్బులు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి.

Giloy Turmeric Water make in this way and take 3 times a week
Giloy Turmeric Water

ఈ నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. అజీర్తి, గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. పొట్ట ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అంతేకాకుండా ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అంతేకాకుండా తిప్ప‌తీగ‌, ప‌సుపు నీటిని తాగ‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. ఈ విధంగా తిప్ప‌తీగ మ‌రియు ప‌సుపు నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నీటిని తీసుకునే ముందే ఆయుర్వేద వైద్యున్ని సంప్ర‌దించి తీసుకోవ‌డం మంచిద‌ని వారు సూచిస్తున్నారు.

D

Recent Posts