హెల్త్ టిప్స్

Gongura : దీన్ని వారంలో మూడు రోజులు తినండి చాలు.. ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

Gongura : గోంగూర అంటే తెలుగువారికి చాలా ఇష్టం. పచ్చడి చేసినా ఊరగాయ పెట్టినా పప్పు చేసినా ఎంతో ఇష్టంగా తింటారు. ఒకరకంగా చెప్పాలంటే గోంగూర అంటే ప్రాణం పెట్టేస్తారు. తెలుగునాట గోంగూరకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆంధ్రమాతగా ఆరాధిస్తారు. ఇష్టంగా భుజిస్తారు. పచ్చడి వేసుకున్నా.. పులుసుగా తిన్నా గోంగూర రుచి మరి దేనికీ ఉండదంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే గోంగూరతో తెలుగువారి జీవనం ముడిపడి పోయింది. అందరికీ అందుబాటు ధరలో ఉండే పుల్లని రుచితో ఉండే గోంగూరలో ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఉన్నాయి. గోంగూరలో విటమిన్ సి, ఎ, బి6 తో పాటు ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. గోంగూరను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. సీజన్ మారుతున్న సమయంలో దగ్గు, రొంప వంటివి వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో గోంగూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.

గోంగూర సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉండటం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారు విటమిన్ K పుష్కలంగా ఉన్న గోంగూర తింటే రక్తహీనత సమస్య నుండి బయట పడవచ్చు. రక్తహీనత సమస్య దూరం కావాలంటే విటమిన్ కె అవసరం. గోంగూరలో విటమిన్ A సమృద్ధిగా ఉండ‌డం వలన తరచుగా గోంగూరను తీసుకుంటే కంటికి సంబంధించిన సమస్యలు తొలగిపోవటమే కాకుండా కంటి చూపు మెరుగవుతుంది. గోంగూరలో ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉండ‌డం వలన యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేసి గుండె, కిడ్నీ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణకు సహాయపడుతుంది.

gongura many wonderful health benefits

మధుమేహం ఉన్నవారికి గోంగూర చాలా మంచిది. గోంగూర రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి షుగర్ లెవెల్స్ ని తగ్గించి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాక రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేసి గుండెకు సంబందించిన సమస్యలు లేకుండా చేస్తుంది. గోంగూరలో క్యాల్షియం, ఇనుము సమృద్ధిగా ఉండ‌డం వలన రోజువారీ ఆహారంలో గోంగూరను భాగంగా చేసుకుంటే ఎముకలు బలంగా, ఆరోగ్యంగా, పటిష్టంగా ఉంటాయి. ఇలా గోంగూర‌తో ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను మ‌నం పొంద‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts