ఆల్క‌హాల్ వ‌ల్ల లివ‌ర్ ఎంత డ్యామేజ్ అయినా.. దీన్ని తాగితే చాలు.. క్లీన్ అవుతుంది..!

మ‌న‌లో కొంత మంది నిత్యం ఆల్కాహాల్ ను తీసుకుంటూ ఉంటారు. ఆల్కాహాల్ ను తీసుకోనిదే వారికి రోజూ గ‌డ‌వ‌దు. ఎవ‌రు ఎంత చెప్పిన వారు మాత్రం ఆల్కాహాల్ ను తీసుకోవ‌డం మాన‌రు. ఇలా నిత్యం ఆల్కాహాల్ ను తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. అలాగే శ‌రీర ఆరోగ్యం దెబ్బ‌తిని మ‌ర‌ణం సంభ‌వించే అవ‌కాశం కూడా ఉంది. ఇలా నిత్యం ఆల్కాహాల్ ను తీసుకునే వారు రోజూ అర లీట‌ర్ ద్రాక్ష పండ్ల ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తిన‌కుండా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఆల్కాహాల్ ను తీసుకునే వారు ద్రాక్ష పండ్ల ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తిన‌కుండా ఉంటుంద‌ని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా వెల్ల‌డించారు.

ద్రాక్ష పండ్ల ర‌సంలో నిరింజిన్ మ‌రియు నిరింజినిన్ అనే ర‌సాయన స‌మ్మేళ‌నాలు ఉంటాయి. అర లీట‌ర్ ద్రాక్ష పండ్ల ర‌సంలో ఈ ర‌సాయ‌న స‌మ్మేళ‌నాలు 300 నుండి 375 మైక్రో గ్రాముల వ‌ర‌కు ఉంటాయి. ఈ ర‌సాయ‌న స‌మ్మేళ‌నాల వ‌ల్ల మ‌న‌కు ముఖ్యంగా మూడు లాభాలు క‌లుగుతాయి. ఆల్కాహాల్ ను తీసుకోవ‌డం వల్ల కాలేయ క‌ణాల్లో వ‌చ్చే ఇన్ ప్లామేష‌న్ త‌గ్గించ‌డంలో ఈ ర‌సాయ‌న స‌మ్మేళ‌నాలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే ఆల్కాహాల్ తీసుకునే వారిలో కాలేయ క‌ణాలు దెబ్బ‌తిని క్ర‌మంగా కాలేయం గ‌ట్టిప‌డిపోతుంది. ఇటువంటి స్థితి కాలేయానికి రాకుండా చేయ‌డంలో కూడా ఈ ర‌సాయ‌న స‌మ్మేళ‌నాలు మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. అదే విధంగా ద్రాక్ష పండ్ల ర‌సం తాగ‌డం వ‌ల్ల ఎడిహెచ్ అనే ఎంజైమ్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. ఇది ఆల్కాహాల్ ను వేగంగా విచ్చినం చేస్తుంది.

Grape Juice For Liver take daily for effective results
Grape Juice For Liver

దీంతో కాలేయానికి ఎక్కువ‌గా న‌ష్టం క‌ల‌గ‌కుండా ఉంటుంది. ఆల్కాహాల్ తీసుకునే వారు ద్రాక్ష పండ్ల ర‌సాన్ని కూడా తీసుకోవ‌డం వ‌ల్ల ఈ విధంగా మూడు ర‌కాల అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చని నిపుణులు చెబుతున్నారు. క‌నుక ఆల్కాహాల్ ను తీసుకునే వారు ద్రాక్ష పండ్ల ర‌సాన్ని కూడా రోజూ 400 నుండి 500 ఎమ్ ఎల్ మోతాదులో తీసుకోవాల‌ని ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల ఆల్కాహాల్ తీసుకున్న‌ప్ప‌టికి కాలేయానికి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts