Green Moong Dal : చాలా మంది, పెసరపప్పుని వాడుతూ ఉంటారు. కానీ, పొట్టు ఉన్న పెసరపప్పుని వాడితే మాత్రం, అద్భుతమైన లాభాలని పొందవచ్చు. పెసరపప్పులో పోషకాలు ఎక్కువ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్స్ తో పాటుగా ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, ఐరన్ కూడా ఇందులో ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మొలకెత్తిన పెసరపప్పుని ఉదయాన్నే తీసుకోవడం వలన, శరీరానికి అధిక మొత్తంలో ప్రోటీన్స్ లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడంతో, అనేక వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది.
పొట్టు తీసిన పెసరపప్పుని ఎక్కువ మంది వాడతారు. కానీ పొట్టు ఉన్న పెసరపప్పుని, చాలా తక్కువ మంది మాత్రమే వాడతారు. పొట్టు ఉన్న పెసరపప్పును తీసుకుంటే మాత్రం అద్భుతమైన లాభాలు పొందవచ్చు. పెసరపప్పుతో పెసరట్లు వేసుకుంటే, ఎంతో రుచిగా ఉంటాయి. తినడానికి కూడా అందరూ ఇష్టపడుతుంటారు. పెసరపప్పును తీసుకుంటే, కొవ్వు పెరిగిపోకుండా ఉంటుంది. రోజువారి అవసరమైన ప్రోటీన్ కూడా అందుతుంది.
ఐరన్ వంటివి కూడా ఇందులో ఉంటాయి. డైటరీ ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. పెసరపప్పుతో మలబద్ధకం సమస్యల నుండి కూడా బయటపడొచ్చు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్లు, పెసరపప్పు తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. పొట్టు ఉన్న పెసరపప్పుతో చేసిన వంటకాలను తీసుకుంటే, గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని పేరుకుపోకుండా ఇది అడ్డుకుంటుంది. గుండెపోటు రాకుండా చూసుకుంటుంది. పొట్టు ఉన్న పెసరపప్పు లో మెగ్నీషియం, పొటాషియంతో పాటుగా రాగి, మ్యాంగనీస్, భాస్వరం కూడా సమృద్ధిగా ఉంటాయి.
పెసరపప్పులోనే కాదు పైన ఉండే పొట్టులో కూడా పోషకాలు ఉంటాయి. అందుకని కచ్చితంగా పొట్టు ఉన్న పెసరపప్పుని వాడడం మంచిది. బరువు పెరిగిపోతారు అన్న సమస్య కూడా ఉండదు. ఎందుకంటే వీటిని తీసుకున్న తర్వాత, మనకి కడుపు నిండుగా ఉంటుంది. ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా, మహిళలు, గర్భిణీలు ఈ పొట్టు పెసరపప్పుని తీసుకుంటే మంచిది. ప్రాణాంతక పరిస్థితులు రాకుండా పెసరపప్పు అడ్డుకుంటుంది. బిడ్డలకి పుట్టుకతో వచ్చే లోపాలని రాకుండా నిరోధిస్తుంది కూడా.