వేసవిలో రాగి జావను తప్పకుండా తాగాలి.. దీంతో కలిగే ప్రయోజనాలివే..!

వేసవి కాలంలో మన శరీరానికి చల్లదనాన్నిచ్చే పదార్థాల్లో రాగి జావ కూడా ఒకటి. రాగులు శరీరానికి చలువ చేస్తాయి. అందువల్ల వేసవిలో వీటిని తప్పకుండా తీసుకోవాలి. చాలా మంది రాగులను జావ రూపంలో తీసుకుంటారు. వీటితో రొట్టెలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. అయితే రొట్టెలను తినడం కొందరికి ఇష్టం ఉండదు. అలాంటి వారు రాగి జావ తాగాలి. దీంతో వేసవిలో ఎండ వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరం చల్లగా ఉంటుంది. ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. రాగి జావతో కలిగే ఇతర ప్రయోజనాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits if ragi java

1. రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. అందువల్ల వాటిని జావ రూపంలో తీసుకుంటే శరీరానికి కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. దీంతో ఎముకలు దృఢంగా ఉంటాయి.

2. రాగుల్లో విటమిన్‌ సి కూడా ఉంటుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

3. రక్తహీనత సమస్య ఉన్నవారికి రాగులు చక్కని ఆహారం. వీటిల్లో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

4. డయాబెటిస్‌ ఉన్నవారికి రాగి జావ చక్కని ఆహారం. దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. కనుక డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది.

5. రాగుల్లో ఉండే పలు రకాల అమైనో ఆమ్లాలు ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ వంటి సమస్యలను తగ్గిస్తాయి. జీవక్రియలు సాఫీగా జరిగేందుకు ఉపయోగపడతాయి.

6. రాగుల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.

7. రాగి జావను తాగడం వల్ల కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

8. బరువు తగ్గాలనుకునే వారికి రాగులు ఎంతగానో మేలు చేస్తాయి. వీటితో తయారు చేసే జావను తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts