ప్రపంచ వ్యాప్తంగా బియ్యంలో అనేక రకాల వెరైటీలు ఉన్నాయి. దాదాపుగా 40వేల రకాలకు పైగా బియ్యం వెరైటీలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాటిల్లో రెడ్ రైస్ ఒకటి. ప్రస్తుత తరుణంలో ఈ రైస్‌ను తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రెడ్ రైస్‌ను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్ ఉన్నవారికి రెడ్ రైస్ వరమనే చెప్పవచ్చు. ఎందుకంటే తెల్ల బియ్యం తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కానీ రెడ్ రైస్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక షుగర్ లెవల్స్ పెరగవు, తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. వారు రెడ్ రైస్‌ను నిస్సందేహంగా తినవచ్చు. షుగర్ పెరుగుతుందని భయ పడాల్సిన పనిలేదు. పైగా అన్నం తిన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది.
రెడ్ రైస్‌లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరం ఆక్సిజన్‌ను ఎక్కువగా గ్రహించేలా చేస్తుంది. దీని వల్ల ఆస్తమా ఉన్న వారికి మేలు జరుగుతుంది. ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
రెడ్ రైస్ లో మెగ్నిషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు రెడ్ రైస్ ను తింటే ఫలితం ఉంటుంది.
రెడ్ రైస్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక మలబద్దకం తగ్గుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
రెడ్ రైస్ ను తినడం వల్ల అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. ఇందులోని ఫైబర్ బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
రెడ్ రైస్ ను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా నివారించవచ్చు. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.