హెల్త్ టిప్స్

కొబ్బ‌రినూనెను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు..!

ప్ర‌కృతి మ‌న‌కు అందించిన అనేక ర‌కాల నూనెల్లో కొబ్బ‌రినూనె ఒక‌టి. ఇది మ‌న‌కు స‌హ‌జ‌సిద్ధంగా ల‌భిస్తుంది. కొబ్బ‌రినూనెను రోజూ ఆహారంలో భాగం చేస‌కోవ‌డం వ‌ల్ల అనేక ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. కొబ్బ‌రినూనెలో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌కు పోష‌ణ‌ను అందిస్తాయి. కొబ్బ‌రినూనెను తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of coconut oil

1. కొబ్బరి నూనెలో కొన్ని ర‌కాల‌ సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును క‌రిగిస్తాయి. శరీరానికి, మెదడుకు శక్తిని ఇస్తాయి. కొబ్బరినూనెలోని ఎంసీటీ-సంతృప్త కొవ్వు శరీరంలో హెచ్‌డీఎల్ లేదా మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. మాంసాహారాలలో ఉండే సంతృప్త కొవ్వుల‌తో పోలిస్తే ఈ కొవ్వు గుండెకు ఆరోగ్యకరమైనది. ఈ నూనె వినియోగంతో శ‌రీరంలో ఏర్పడే కీటోన్లు మెదడుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మూర్ఛ, అల్జీమర్స్ వ్యాధుల‌ను త‌గ్గించేందుకు దోహ‌దం చేస్తాయి.

2. కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది బ్యాక్టీరియాను స‌మర్థ‌వంతంగా ఎదుర్కొంటుంది. కొబ్బరి నూనెను ఆహారంలో తీసుకోవడం ఎంత‌గానో మేలు చేస్తుంది. దీంతో దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ నూనెను తగినంతగా ఉపయోగించడం ద్వారా జలుబు రాకుండా అడ్డుకోవ‌చ్చు.

3.కొబ్బ‌రినూనె జుట్టుకు కండిషనింగ్, పోషణను అందిస్తుంది. కొబ్బరి నూనెతో తరచూ జుట్టుకు మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల చ‌క్క‌ని ఫ‌లితం ఉంటుంది. దీంతో జుట్టు పొడవుగా పెరగ‌డ‌మే కాక మెరుస్తుంది. జుట్టు దృఢంగా మారుతుంది.

4. కొబ్బ‌రినూనె చర్మాన్ని తేమగా చేస్తుంది. చ‌ర్మం నునుపుగా, మృదువుగా మారుతుంది. కొబ్బరి నూనెతో శ‌రీరాన్ని మసాజ్ చేయడం వల్ల ఉత్సాహంగా మారుతారు. చ‌ర్మం సురక్షితంగా ఉంటుంది. చ‌ర్మ వ్యాధులు త‌గ్గుతాయి. చ‌ర్మం ప్రకాశిస్తుంది. కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా వాడటం వల్ల తామర వంటి చర్మ సమస్యలు తొలగిపోతాయి. ఇది అతినీల‌లోహిత‌ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. కాలుష్యం నుండి క‌లిగే నష్టాన్ని నివారిస్తుంది.

5. కొబ్బరి నూనెను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ నూనెలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు జీర్ణవ్యవస్థలోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. మంటను తగ్గిస్తాయి. జీర్ణక్రియను పెంచుతాయి.

కొబ్బ‌రినూనెతో వంట‌లు చేసుకుని తిన‌వ‌చ్చు. లేదా దాన్ని ఆహారాల‌పై చ‌ల్లుకుని తీసుకోవ‌చ్చు. దీంతో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts