కోడిగుడ్లలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు వాటిల్లో ఉంటాయి. ఈ క్రమంలో రోజూ గుడ్లను తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అందుతాయి. శరీరానికి శక్తి లభిస్తుంది. పోషకాలు అందుతాయి. అయితే కొందరు కోడిగుడ్లను తినేందుకు ఇష్టపడరు. అలాంటి వారు గుడ్లకు బదులుగా ఈ ఆహారాలను తీసుకోవచ్చు. వీటి ద్వారా కూడా కోడిగుడ్ల మాదిరిగా పోషకాలు లభిస్తాయి. అందువల్ల గుడ్లను తినలేని వారు వీటిని రోజూ తీసుకోవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
1. కోడిగుడ్లను తినలేని వారు పనీర్‌ను తీసుకోవచ్చు. గుడ్డుకు ప్రత్యామ్నాయంగా ఇది పోషకాలను అందిస్తుంది. పాలలోని పోషక విలువలు పనీర్‌లో ఉంటాయి. ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి. ఒక గుడ్డును తినడం వల్ల ఎన్నయితే పోషకాలు లభిస్తాయో 60 గ్రాముల పనీర్‌ను తినడం వల్ల కూడా అన్నే పోషకాలు లభిస్తాయి. అందువల్ల గుడ్లను తినడం లేదని బాధపడాల్సిన పనిలేదు. అందుకు బదులుగా పనీర్‌ను తీసుకోవచ్చు. దీంతో పోషకాలు, శక్తి రెండూ లభిస్తాయి.
2. రోజూ ఒక టేబుల్ స్పూన్ చొప్పున చియా విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు, అవిసె గింజలను తినాలి. దీంతో శక్తి, పోషకాలు లభిస్తాయి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి శరీరానికి పోషణను అందిస్తాయి. వీటిల్లో జింక్, ఫాస్ఫరస్, ఇతర మినరల్స్ కూడా ఉంటాయి. అందువల్ల ఒక కోడిగుడ్డును తినేబదులు వీటిని ఒక టేబుల్ స్పూన్ చొప్పున తింటే చాలు. గుడ్డు ద్వారా లభించే పోషకాలు వీటి ద్వారా కూడా లభిస్తాయి.
3. పప్పు దినుసులను తినడం వల్ల కూడా కోడిగుడ్డులో లాంటి పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు, ఇతర పోషకాలు అందుతాయి. పప్పు దినుసులను ఒక కప్పు మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది.
4. చీజ్‌లో ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్ బి12, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. అందువల్ల దీన్ని కూడా గుడ్డుకు ప్రత్యామ్నాయ ఆహారంగా చెప్పవచ్చు.
5. రాజ్మా లేదా కిడ్నీ బీన్స్‌లోనూ గుడ్లలో లాంటి పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, ఐరన్, పొటాషియం, విటమిన్ కె1, కాపర్, మెగ్నిషియం తదితర పోషకాలు లభిస్తాయి. వీటితో శరీరానికి పోషణ, శక్తి లభిస్తాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365