ఎప్పటిలాగే ఈ సారి కూడా వర్షాకాలం వచ్చేసింది. వర్షంలో తడవడం అంటే కొందరికి ఇష్టమే. కానీ వర్షాకాలంతోపాటు వ్యాధులు కూడా వస్తుంటాయి. దీన్నే ఫ్లూ సీజన్ అని కూడా అంటారు. ఈ సీజన్‌లో దాదాపుగా ప్రతి ఒక్కరూ అనారోగ్యాల బారిన పడుతుంటారు. అయితే ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్ వాడాల్సిన పనిలేదు. మన ఇళ్లలో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే మనకు సీజనల్ గా వచ్చే వ్యాధులను నయం చేసుకోవచ్చు. దీంతోపాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మరి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. నల్ల మిరియాలను నల్ల బంగారంగా చెప్పవచ్చు. వీటిలో అనేక పోషకాలు, ఔషధ విలువలు ఉంటాయి. వీటిని పోషకాలకు గనిగా చెప్పవచ్చు. వీటిలో ఫాస్ఫరస్, మాంగనీస్, కెరోటీన్, సెలీనియం, విటమిన్ కె తదితర పోషకాలు ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అందువల్ల నల్ల మిరియాలను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.
2. పసుపు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ కార్సినోజెనిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు రావు.
3. లవంగాల్లో అద్భుతమైన, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు, గొంతు సమస్యలు తగ్గుతాయి. లవంగాల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ సెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. దీని వల్ల ఫ్లూ నుంచి బయట పడవచ్చు.
4. రోగ నిరోధక శక్తిని పెంచడంలో దాల్చిన చెక్క బాగా పనిచేస్తుంది. ఇది దంతాలు, చిగుళ్లను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల అధిక బరువు తగ్గుతారు. ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365