వేసవి సీజన్ రాగానే సహజంగానే మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. తలనొప్పి, డీహైడ్రేషన్, చర్మం పగలడం, జీర్ణ సమస్యలు, దగ్గు వంటివి వస్తుంటాయి. అయితే వీటన్నింటికీ కలబంద జ్యూస్ చెక్ పెడుతుంది. రోజూ పరగడుపునే కలబంద జ్యూస్‌ను తాగడం వల్ల అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఎండకాలంలో వేడి వల్ల సహజంగానే చాలా మందికి తలనొప్పి సమస్య వస్తుంటుంది. అయితే కలబంద జ్యూస్‌ను పరగడుపునే తాగడం వల్ల తలనొప్పి సమస్య నుంచి బయట పడవచ్చు.
2. రోజూ ఉదయాన్నే చాలా మంది సుఖ విరేచనం అవ్వక ఇబ్బందులు పడుతుంటారు. మలబద్దకం సమస్య బాధిస్తుంటుంది. అలాంటి వారు కలబంద జ్యూస్‌ను రోజూ తాగుతుంటే ప్రయోజనం ఉంటుంది.
3. కలబంద జ్యూస్‌ను తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.
4. రక్తహీనత సమస్య ఉన్నవారికి కలబంద జ్యూస్ ఔషధంగా పనిచేస్తుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. రక్తహీనత సమస్య తొలగిపోతుంది.
5. చాలా మంది ఆకలి సరిగ్గా అవడం లేదని చెబుతుంటారు. అలాంటి వారు రోజూ కలబంద జ్యూస్‌ను తాగడం వల్ల ఫలితం ఉంటుంది. ఆకలి బాగా అవుతుంది.
6. కలబంద గుజ్జును చర్మంపై రాయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మ సమస్యలు పోతాయి. చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలు మాయమవుతాయి. పలు ఫేస్ ప్యాక్‌లలో దీన్ని ఉపయోగించవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365