వేసవి కాలంలో సహజంగానే చాలా మంది ఎండ వేడిని తట్టుకునేందుకు మజ్జిగను తాగుతుంటారు. అందులో కొద్దిగా నిమ్మరసం, అల్లంరసం కలిపి తీసుకుంటుంటారు. దీంతో వేసవి తాపం తగ్గుతుంది. శరీరం చల్లబడుతుంది. అయితే నిజానికి రోజూ మజ్జిగను తాగాల్సిందే. ఏ సీజన్‌లో అయినా సరే మజ్జిగను రోజూ తాగితే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఒక గ్లాస్ మజ్జిగలో కొద్దిగా నిమ్మరసం, అల్లం రసం కలిపి సేవిస్తే ఎంతో ఉపయోగం కలుగుతుంది.
1. రోజూ మధ్యాహ్నం భోజనం అనంతరం ఒక గ్లాస్ మజ్జిగను సేవించడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి.
2. మజ్జిగ ప్రొబయోటిక్ ఆహారం. అంటే ఇది మన జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బాక్టీరియాకు మేలు చేస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మజ్జిగలో కొద్దిగా జీలకర్ర లేదా వాము పొడి కలిపి తాగితే జీర్ణ సమస్యలు ఉండవు. మలబద్దకం తగ్గుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.
3. మజ్జిగలో అనేక ప్రోటీన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి మన శరీరానికి రోజూ అవసరం. అనేక విధులు నిర్వర్తించేందుకు ఇవి దోహదపడతాయి.
4. కాల్షియం లోపం సమస్య ఉన్నవారు రోజూ మజ్జిగను సేవించడం మంచింది. దీంతో ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
5. కొందరికి ఏ సీజన్‌లో అయినా సరే శరీరం వేడిగా ఉంటుంది. ఇక కారం, మసాలాలు తినడం వల్ల కూడా వేడిగా మారుతుంది. అలాంటి వారు మజ్జిగను తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365