రోజూ సూర్యరశ్మిలో కొంత సమయం పాటు గడపడం వల్ల మన శరీరానికి విటమిన్ డి లభిస్తుందనే సంగతి తెలిసిందే. సూర్యరశ్మిలో ఉంటే శరీరం విటమిన్ డిని తయారు చేసుకుని ఉపయోగించుకుంటుంది. దీంతో అనేక జీవక్రియలు సరిగ్గా నిర్వర్తించబడతాయి. అయితే చాలా మందికి విటమిన్ డి లోపం వస్తోంది. అందుకు కారణం.. రోజూ ఎండలో గడపకపోవడమే. దీంతోపాటు అనారోగ్య సమస్యల వల్ల కూడా విటమిన్ డి లోపం వస్తోంది.
రోజూ సూర్మరశ్మి తగలకపోతే తగినంత విటమిన్ డి తయారుకాదు. దీంతోపాటు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సూర్యరశ్మిలో ఉండకపోతే విటమిన్ డి తయారు కాదు. దీంతో శరీరం కాల్షియంను శోషించుకోదు. ఈ క్రమంలో ఎముకలు గుల్లగా మారి పెళుసుగా మారిపోతాయి. బలహీనంగా తయారవుతాయి. దీంతో అవి విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో కండరాల బలహీనత, రికెట్స్, ఆస్టియోమలేషియా, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి.
సూర్యరశ్మిలో ఉండకపోతే విటమిన్ డి తయారు కాదు. కనుక కాలివేళ్ల ఎముకల్లో సమస్యలు వస్తాయి. నొప్పులు వస్తాయి. విటమిన్ డి తగినంత లభించకపోవడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి.
విటమిన్ డి తగినంత లభించకపోతే డిప్రెషన్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. చర్మ సమస్యలు వస్తాయి. సోరియాసిస్, మొటిమలు వస్తాయి. అధికంగా బరువు పెరుగుతారు. కనుక రోజూ కొంత సమయం పాటు సూర్య రశ్మిలో గడపాలి. దీంతో విటమిన్ డి తయారవుతుంది. పైన తెలిపిన సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365