చిట్కాలు

బీపీ, షుగ‌ర్‌ల‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలా ? ఇలా చేయండి.!

మ‌నం పాటిస్తున్న ఆహార‌పు అల‌వాట్లు, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం, వంశ‌పారంప‌ర్య కార‌ణాల వ‌ల్ల చాలా మందికి బీపీ, షుగ‌ర్ వ‌స్తున్నాయి. అధిక శాతం మంది ఈ రెండు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. అయితే కింద తెలిపిన ప‌లు చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల బీపీ, షుగ‌ర్ ల‌ను విజ‌య‌వంతంగా అదుపులో ఉంచుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే..?

want to control bp and sugar do like this

బీపీకి

1. గుప్పెడు మెంతుల్ని రాత్రి నీటిలో నానబెట్టి మ‌రుస‌టి రోజు పరగడుపునే వాటిని నమిలి తినాలి. దీని వల్ల బీపీ పూర్తి స్థాయిలో అదుపులోకి వ‌స్తుంది.

2. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను అలాగే న‌మిలి తింటుండాలి. బీపీ త‌గ్గుతుంది.

3. ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ‌ల ర‌సం, రెండు టేబుల్ స్పూన్ల తేనెను క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని రోజూ ఉద‌యం, సాయంత్రం రెండు పూట‌లా తీసుకుంటుండాలి. బీపీ అదుపులోకి వ‌స్తుంది.

4. ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో కొన్ని క‌రివేపాకుల‌ను వేసి మ‌రిగించాలి. ఆ నీటిని ఉద‌యం, సాయంత్రం తాగాలి. బీపీ త‌గ్గుతుంది.

5. అర‌క‌ప్పు క్యారెట్ జ్యూస్, అర‌క‌ప్పు పాల‌కూర జ్యూస్‌ల‌ను క‌లిపి ఒక క‌ప్పు మోతాదులో ఆ మిశ్ర‌మాన్ని తాగితే బీపీ త‌గ్గుతుంది. రోజుకు ఇలా ఒక్క‌సారి తాగాలి.

షుగ‌ర్‌కి

6. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక టీస్పూన్ మెంతుల‌ను తిని అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటిని తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.

7. మెంతులు, నేరేడు విత్త‌నాలు, వేప విత్త‌నాలు, కాక‌ర‌కాయ విత్త‌నాల‌ను ఎండ‌బెట్టి స‌మాన భాగాల్లో తీసుకోవాలి. అనంతరం వాటిని క‌లిపి మిక్సీలో వేసి పొడిలా చేయాలి. ఆ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో రోజుకు రెండు సార్లు భోజ‌నానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. ఇలా రోజూ తీసుకుంటుంటే షుగ‌ర్ అదుపులోకి వ‌స్తుంది.

8. రోజూ రెండు టీస్పూన్ల‌ మెంతి పొడిని నీటితో గానీ, పాలతో గానీ తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధి త‌గ్గుతుంది.

9. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 30ఎంఎల్ మోతాదులో ఉసిరికాయ జ్యూస్‌ను తాగాలి. షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.

10. ప‌ర‌గ‌డుపునే 30 ఎంఎల్ మోతాదులో కాక‌ర‌కాయ జ్యూస్‌ను తాగుతున్నా షుగ‌ర్ ను అదుపులోకి తేవ‌చ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts