ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది చల్లని నీటిని తాగుతుంటారు. అయితే చాలా మంది ఇండ్లలో ఫ్రిజ్‌లు ఉంటాయి. కనుక ఫ్రిజ్‌లలో ఉంచిన నీటిని తాగుతారు. కానీ నిజానికి ఆరోగ్యానికి ఆ నీళ్లు మంచివి కావు. అంత చల్లని నీటిని తాగరాదు. అందుకు బదులుగా మట్టి కుండల్లో నిల్వ చేసిన నీటిని తాగాలి. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
ఫ్రిజ్‌లలో నీరు కృత్రిమంగా చల్లగా అవుతుంది. కానీ కుండలను మట్టితో తయారు చేస్తారు కనుక వాటిల్లో సహజసిద్ధంగా నీరు చల్లగా అవుతుంది. అలాంటి నీటినే తాగాల్సి ఉంటుంది. ఫ్రిజ్‌లలోని నీటిని తాగితే దగ్గు, జలుబు ఇతర శ్వాసకోశ సమస్యలు వస్తాయి. కానీ కుండల్లో నీటిని తాగితే శరీరానికి చల్లదనం లభిస్తుంది. వేసవి తాపం నుంచి బయట పడవచ్చు.
దగ్గు, జలుబు సమస్యలు తరచూ వచ్చే వారు ఫ్రిజ్ లలోని నీటి కన్నా కుండల్లోని నీటిని తాగాల్సి ఉంటుంది. దీంతో సమస్యలు మరింత తీవ్రం కాకుండా ఉంటాయి. గొంతు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
నీటిని తక్కువగా తాగడం వల్ల సహజంగానే చాలా మంది ఎండాకాలంలో ఎండ దెబ్బకు గురవుతుంటారు. అయితే మట్టి కుండల్లో నీటిని తాగడం వల్ల అందులో ఉండే ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ శరీరానికి అందుతాయి. దీంతో శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు సమతుల్యంలో ఉంటాయి. శరీరానికి చల్లదనం లభిస్తుంది. మట్టి కుండలోని నీరు ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. మన శరీరం అసిడిక్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ క్రమంలో మట్టి కుండల్లోని నీటిని తాగితే శరీరంలో పీహెచ్ స్థాయిలు సమతుల్యం అవుతాయి. అలాగే ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు.
మట్టి కుండల్లోని నీటిని తాగడం వల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. ఇది అధిక బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
వేసవిలో సహజంగానే మనం నీటిని ఎక్కువగా తాగుతాం. అయినప్పటికీ ఎండలో తిరిగితే శరీరంలోని ద్రవాలు త్వరగా అయిపోతాయి. డీహైడ్రేషన్ బారిన పడతారు. కానీ ఇలా జరగకుండా ఉండాలంటే మట్టి కుండలోని నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. డీహైడ్రేషన్ కు గురవకుండా ఉంటారు.