Papaya Seeds : బొప్పాయి పండ్లను తినగానే చాలా మంది విత్తనాలను పడేస్తుంటారు. కానీ నిజానికి విత్తనాలను కూడా తినవచ్చు. వాటిని చూస్తే తినాలనిపించదు. కానీ బొప్పాయి విత్తనాలను తినవచ్చని, వాటితోనూ ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. నిత్యం పరగడుపునే 2 టీస్పూన్ల బొప్పాయి విత్తనాలను రోజూ తింటుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. హార్ట్ ఎటాక్, క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. కిడ్నీ, కాలేయ సమస్యలు పోతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.
2. బొప్పాయి పండు విత్తనాలను తింటే శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా తయారవుతుంది. పలు అవయవాల్లో ఉండే వ్యర్థాలు తొలగింపబడతాయి.
3. శరీర బరువును తగ్గించడంలో బొప్పాయి విత్తనాలు బాగా పనిచేస్తాయి. బొప్పాయి విత్తనాల్లో ఉండే ఔషధ గుణాలు శరీర బరువును తగ్గిస్తాయి. శరీర మెటబాలిజంను పెంచుతాయి. దీంతో బరువు త్వరగా తగ్గుతారు.
4. బొప్పాయి విత్తనాల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శక్తిని అందిస్తాయి. కండరాల నిర్మాణానికి దోహదం చేస్తాయి.
5. బొప్పాయి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
6. బొప్పాయి విత్తనాలను తినడం వల్ల క్యాన్సర్ కణాలు, ట్యూమర్లు వృద్ధి చెందవు. పలు రకాల క్యాన్సర్లను అడ్డుకునే శక్తి బొప్పాయి విత్తనాలకు ఉంది.
7. బొప్పాయి విత్తనాల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గిస్తాయి.
8. బొప్పాయి విత్తనాలను రోజుకు 2 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకోవచ్చు. విత్తనాలను నేరుగా తినలేమని అనుకునే వారు వాటిని పొడి చేసుకుని దాన్ని ఒక టీస్పూన్ మోతాదులో మజ్జిగ, లేదా ఏదైనా సలాడ్‌లో కలుపుకుని తీసుకోవచ్చు. 5 లేదా 6 బొప్పాయి విత్తనాలను తీసుకుని వాటిని గుజ్జుగా చేసి ఏదైనా పండ్ల రసం లేదా నిమ్మరసంతో కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే లివర్ శుభ్ర పడుతుంది.
9. బొప్పాయి విత్తనాలను తినడం వల్ల ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది.
10. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో బొప్పాయి విత్తనాలు బాగా పనిచేస్తాయి. కిడ్నీల్లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి.
సూచన – బొప్పాయి విత్తనాలు ఆరోగ్యకరమే అయినప్పటికీ వీటిని అధికంగా తీసుకోరాదు. తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు వీటిని తినరాదు.