కిస్మిస్ పండ్లు అంటే అందరికీ ఇష్టమే. వాటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వాటిని ఎక్కువగా తీపి వంటకాల్లో వేస్తారు. అంటే కిస్మిస్‌లోనూ పలు రకాలు ఉంటాయి. వాటిల్లో నలుపు రంగు కిస్మిస్‌లు ఒకటి. నల్ల ద్రాక్షలను ఎండబెట్టి వీటిని తయారు చేస్తారు. సాధారణ కిస్మిస్‌లతో పోలిస్తే ఈ కిస్మిస్‌లు ఎన్నో ఔషధ గుణాలను దాగి ఉంటాయి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మనం రోజూ తినే పదార్థాలు, తాగే పానీయాల వల్ల రక్తంలో వ్యర్ధాలు పేరుకుపోతుంటాయి. కానీ నలుపు రంగు కిస్మిస్‌లను తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. అందులో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. విష పదార్థాలు నశిస్తాయి. రక్తం శుభ్రంగా మారుతుంది. ఇన్‌ఫెక్షన్లు రావు.
2. నలుపు రంగు కిస్మిస్‌లను తినడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.
3. నలుపు రంగు కిస్మిస్‌లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందువల్ల వాటిని రోజూ తింటుంటే జుట్టు సమస్యలు తగ్గుతాయి. వెంట్రుకలు రాలిపోవడం, చుండ్రు తగ్గుతాయి. జుట్టు నల్లగా మారుతుంది.
4. ఈ కిస్మిస్‌లలో పొటాషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. అందువల్ల ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ సమస్యలు ఉన్నవారు రోజూ నలుపు రంగు కిస్మిస్ లను తినడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
5. ఈ కిస్మిస్ లను తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
6. ఈ కిస్మిస్‌లలో పొటాషియం అధికంగా ఉంటుంది కనుక హైబీపీ ఉన్నవారు వీటిని రోజూ తింటే మంచిది. దీంతో బీపీ తగ్గుతుంది.
7. దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు నలుపు రంగు కిస్మిస్ పండ్లు ఎంతగానో దోహదం చేస్తాయి. వీటిల్లో శక్తివంతమైన ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి దంత క్షయం కాకుండా దంతాలను రక్షిస్తాయి. దంతాలను, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. నోట్లో ఉండే బాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది. నోరు శుభ్రంగా మారుతుంది.
8. ఈ కిస్మస్‌లలో ఐరన్ అధికంగా ఉంటుంది. దీంతో ఐరన్ లోపం నుంచి బయట పడవచ్చు. రక్తం బాగా తయారవుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. రక్తహీనత నుంచి బయట పడవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365