పచ్చి కొబ్బరిని రోజూ తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

కొబ్బరి బొండాలను కొట్టుకుని తాగిన తరువాత అందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలను కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. కాకపోతే ఆ కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరినూనె లాగే పచ్చి కొబ్బరి కూడా మనకు మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of eating raw coconut

1. ఫైబర్‌ తక్కువగా ఉండే ఆహారాలను తింటే మలబద్దకం సమస్య ఏర్పడుతుంది. కొందరిలో పలు భిన్న రకాల కారణాల వల్ల మలబద్దకం ఏర్పడుతుంది. అయితే పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. ఎందుకంటే కొబ్బరిలో 61 శాతం మేర ఫైబర్‌ ఉంటుంది. కూరగాయలు, ఇతర పదార్థాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. కనుక మన శరీరానికి పుష్కలంగా ఫైబర్‌ లభిస్తుంది. దీంతో మలబద్దకం సమస్య ఉండదు. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. పేగుల్లో కదలికలు బాగుంటాయి. సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం గురించి బెంగ పడాల్సిన పని ఉండదు.

2. పొడి చర్మం, వెంట్రుకలు చిట్లడం అనే సమస్యలు చాలా మందికి ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవారు పచ్చికొబ్బరిని రోజూ తినాలి. దీంతో కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. చర్మంలో తేమ ఉండేలా చూస్తాయి. దీంతో చర్మం పొడిబారడం తగ్గుతుంది. చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనిపిస్తుంది. అలాగే కొబ్బరిలో మోనోలారిన్‌, లారిక్‌ యాసిడ్‌లు ఉంటాయి కనుక అది యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు తగ్గుతాయి. జుట్టు కుదుళ్లు దృఢంగా మారుతాయి. చుండ్రు సమస్య ఉండదు. కొబ్బరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలను దెబ్బ తినకుండా చూస్తాయి. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

3. అధిక బరువు తగ్గాలనుకునే వారు రోజూ పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగం చేసుకోవాలి. పచ్చికొబ్బరిని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి. పచ్చికొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. అధిక బరువు తగ్గుతారు. ఆకలి నియంత్రణలో ఉంటుంది. అధికంగా ఆహారం తీసుకోకుండా జాగ్రత్త పడవచ్చు. ఇది అధిక బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.

4. కొబ్బరిలో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు ఉంటాయి. అందువల్ల దాన్ని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు, బ్రాంకైటిస్‌ సమస్యలు తగ్గుతాయి.

5. పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ విషయాన్ని సైంటిస్టులు తమ అధ్యయనాల ద్వారా వెల్లడించారు. ఆ వివరాలను న్యూట్రియెంట్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు. కొబ్బరిలో మీడియం చెయిన్‌ ట్రై గ్లిజరైడ్స్‌ ఉంటాయి. ఇవి కీటోజెనిక్‌ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల అల్జీమర్స్‌ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts