ఐర‌న్ సమృద్ధిగా ఉండే శాకాహారాలు ఇవే..!

మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవాలి. పోష‌కాల్లో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ముఖ్య‌మైన‌వి. వాటిని రోజూ శ‌రీరానికి అందేలా చూసుకోవాలి. ఇక మ‌న‌కు రోజూ కావ‌ల్సిన విట‌మిన్ల‌లో ఐర‌న్ ఒక‌టి. ఇది అనేక క్రియ‌ల‌ను నిర్వ‌ర్తించేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తుతుంది. ముఖ్యంగా ర‌క్తం ఎక్కువ‌గా త‌యారు కావాలంటే ఐర‌న్ అవ‌స‌రం అవుతుంది. అందువ‌ల్ల ఐర‌న్ ఉండే ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి. అయితే ఐర‌న్ అనేక శాకాహారాలు, మాంసాహారాల్లో ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలోనే మాంసాహారం తిన‌లేని వారు కొన్ని శాకాహారాల‌ను తిన‌డం వ‌ల్ల కూడా ఐర‌న్‌ను పొంద‌వ‌చ్చు. మ‌రి ఆ శాకాహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

these are iron rich vegetarian foods

1. ఒక క‌ప్పు సోయాబీన్‌లో 8.8 మిల్లీగ్రాముల ఐర‌న్ ఉంటుంది. ఇది మ‌న‌కు రోజూ కావ‌ల్సిన ఐర‌న్‌లో 49 శాతం. అలాగే సోయాబీన్‌లో ప్రోటీన్లు, మెగ్నిషియం, కాల్షియం, ఫాస్ఫ‌ర‌స్ కూడా ఉంటాయి. వీటి వ‌ల్ల మ‌న శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది.

2. ప‌ప్పు దినుసుల్లోనూ ఐర‌న్ స‌మృద్ధిగా ఉంటుంది. ఒక క‌ప్పు ప‌ప్పు దినుసుల‌ను తిన‌డం ద్వారా సుమారుగా 6.6 మిల్లీగ్రాముల ఐర‌న్ ల‌భిస్తుంది. మ‌న‌కు రోజూ కావ‌ల్సిన ఐర‌న్‌లో ఇది 37 శాతం. అలాగే ప‌ప్పు దినుసుల‌ను తిన‌డం వ‌ల్ల రోజూ మ‌న‌కు కావ‌ల్సిన ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు ల‌భిస్తాయి.

3. పాల‌కూర‌, మెంతి ఆకు, క్యాబేజీ త‌దిత‌ర ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు, ఆకు కూర‌ల్లోనూ ఐర‌న్ ఉంటుంది. వీటిని ఒక క‌ప్పు మోతాదులో తింటే 2.5 నుంచి 6 మిల్లీగ్రాముల వ‌ర‌కు ఐర‌న్ ల‌భిస్తుంది. రోజులో మ‌న‌కు కావ‌ల్సిన దాంట్లో ఇది 14-36 శాతానికి స‌మానం. కూర‌గాయ‌లు, ఆకుకూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల పొటాషియం, సోడియం వంటి ముఖ్య‌మైన పోష‌కాలు కూడా మ‌న‌కు ల‌భిస్తాయి.

4. ఒక క‌ప్పు పొట్టు తీయ‌ని ఆలుగ‌డ్డ‌ల ద్వారా 3.2 మిల్లీగ్రాముల ఐర‌న్ ల‌భిస్తుంది. ఆలుగ‌డ్డ‌లను పొట్టుతో క‌లిపి తీసుకుంటే ఫైబ‌ర్‌, విట‌మిన్ సి, బి6, పొటాషియం వంటి పోష‌కాలు ల‌భిస్తాయి.

5. పుట్ట గొడుగుల్లోనూ ఐర‌న్ సమృద్ధిగా ఉంటుంది. ఒక క‌ప్పు పుట్ట‌గొడుగుల‌ను తింటే 2.7 మిల్లీగ్రాముల ఐర‌న్ ల‌భిస్తుంది.

6. గుమ్మ‌డికాయ విత్త‌నాలు, నువ్వులు, ఇత‌ర గింజ‌ల్లో ఐర‌న్ అధికంగా ఉంటుంది. అలాగే వృక్ష సంబంధ ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఫైబ‌ర్‌, కాల్షియం, మెగ్నిషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్ల వంటి పోష‌కాలు విత్త‌నాల ద్వారా ల‌భిస్తాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts