తృణ ధాన్యాలు అన్నీ మనకు ఆరోగ్యాన్ని అందిస్తాయి. వాటిల్లో ఓట్స్ ఒకటి. ఇవి అత్యంత ఆరోగ్యకరమైన తృణ ధాన్యాలు అని చెప్పవచ్చు. వీటిల్లో గ్లూటెన్ ఉండదు. పైగా అనేక రకాల విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఓట్స్ లో ఉంటాయి. అందువల్ల ఓట్స్ ను రోజూ తీసుకుంటే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
1. ఓట్స్‌లో మాంగనీస్, ఫాస్ఫరస్, మెగ్నిషియం, కాపర్, ఐరన్, జింక్, ఫోలేట్, విటమిన్ బి1, బి5, కాల్షియం, పొటాషియం, విటమిన్ బి6, బి3, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్ల ఓట్స్ ను పోషకాలకు గనిగా చెప్పవచ్చు. వీటిని రోజూ తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. పోషకాల లోపం రాకుండా చూసుకోవచ్చు.
2. ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా పాలిఫినాల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి బీపీని తగ్గిస్తాయి. రక్త నాళాల్లో రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూస్తాయి. గుండెను సంరక్షిస్తాయి. ఓట్స్ ను రోజూ తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా గుండె జబ్బుల బారిన పడిన వారు వీటిని రోజూ తీసుకోవడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. హార్ట్ ఎటాక్‌లు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
3. ఓట్స్ లో బీటా గ్లూకాన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్)ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. జీర్ణవ్యవస్థలో మంచి బాక్టీరియాను పెంచుతుంది. అధిక బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
4. ఓట్స్ ను రోజూ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. వాపులు తగ్గుతాయి. ఫ్రీ ర్యాడికల్స్ నశిస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కణాలు దెబ్బ తినకుండా చూసుకోవచ్చు.
5. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు రోజూ ఓట్స్ ను తీసుకుంటే డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా గ్రహిస్తుంది.
6. అధిక బరువు తగ్గేందుకు ఓట్స్ ఎంతగానో సహాయ పడతాయి. వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అధిక బరువును త్వరగా తగ్గించుకోవచ్చు.
7. చర్మ సంరక్షణకు ఓట్స్ మేలు చేస్తాయి. ఓట్స్‌ను తినడం వల్ల చర్మంపై ఏర్పడే దద్దుర్లు, దురదలు తగ్గిపోతాయి.
8. చిన్నారులకు ఓట్స్ ను తినిపిస్తే వారిలో ఆస్తమాను తగ్గించవచ్చు. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. శ్వాస సరిగ్గా లభిస్తుంది. ఆస్తమా తీవ్రతరం కాకుండా ఉంటుంది.
9. మలబద్దకం సమస్య ఉన్నవారు రోజూ ఓట్స్ ను తినడం వల్ల మేలు జరుగుతుంది. ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
ఓట్స్‌ను రోజూ పాలలో కలిపి తినవచ్చు. లేదా ఓట్ మీల్‌గా ఓట్స్‌ను ఉడకబెట్టి తీసుకోవచ్చు. అందులో పండ్లు కలిపి కూడా తీసుకోవచ్చు. దీంతో పైన చెప్పిన ప్రయోజనాలు కలుగుతాయి.