పోషకాలను అందిస్తూ అనారోగ్యాలను దూరం చేసే చిలగడదుంపలు..!

చిలగడదుంపలు.. కొన్ని చోట్ల వీటినే కంద గడ్డలు అని పిలుస్తారు. అయితే చాలా మంది వీటిని తినేందుకు ఇష్ట పడరు. కానీ వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. ఇతర దుంపల్లా ఇది కాదు. దీన్ని నేరుగానే తినవచ్చు. అలా ఇష్టపడకపోతే ఉడకబెట్టుకుని తినవచ్చు. లేదా కూర రూపంలో చేసుకుని తినవచ్చు. ఎలా తిన్నా చిలగడదుంపలు మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలనే అందిస్తాయి. పౌష్టికాహార నిపుణులు కూడా వీటిని తరచూ తినాలని చెబుతుంటారు. వీటి ద్వారా మనకు అనేక పోషకాలు అందుతాయి.

health benefits of sweet potatoes

చిలగడదుంపలను కొందరు పండుగల సమయాల్లో తింటారు. కొందరు ఉపవాస దీక్షల అనంతరం తింటారు. అయితే ఈ దుంపల్లో అద్భుతమైన పోషకాలు ఉంటాయని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. అందువల్ల వీటిని ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి.

1. చిలగడ దుంపల్లో బీటా కెరోటిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. దీని వల్ల కణజాలం దెబ్బ తినకుండా ఉంటుంది. తద్వారా క్యాన్సర్‌ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. బీటా కెరోటిన్‌ కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ దుంపలను తరచూ తీసుకోవడం వల్ల పేగులు, పురీషనాళం, ప్రోస్టేట్‌, మూత్ర పిండాలు, ఇతర భాగాల్లో క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.

2. చిలగడదుంపల్లో మంటను చల్లార్చే గుణాలు ఉంటాయి. వీటిల్లో విటమిన్‌ సి, మెగ్నిషియం, బీటాకెరోటిన్‌లు ఉంటాయి కనుక తాపం తగ్గుతుంది.

3. చిలగడదుంపలను తినడం వల్ల శరీరంలో శ్లేష్మం తగ్గుతుంది. దీని వల్ల శ్వాసనాళాలు, ఊపిరితిత్తుల్లో ఉండే శ్లేష్మం తొలగిపోతుంది. ఆయా భాగాలకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆస్తమా, ముక్కు దిబ్బడ తగ్గుతాయి.

4. బ్రాంకైటిస్‌ సమస్య ఉన్నవారు చిలగడదుంపలను తినడం వల్ల ఫలితం ఉంటుంది. ఈ దుంపల్లో ఉండే విటమిన్‌ సి, ఐరన్‌లు బ్రాంకైటిస్‌ సమస్యతో బాధపడేవారికి మేలు చేస్తాయి.

5. చిలగడదుంపల్లో ఉండే బీటా కెరోటీన్‌, మెగ్నిషియం, బి విటమిన్లు ఆర్థరైటిస్‌ నొప్పులను తగ్గిస్తాయి. చిలగడ దుంపలను తింటుండడం లేదా వాటిని ఉడకబెట్టిన నీటితో మర్దనా చేస్తుండడం వంటివి చేస్తే ఆయా నొప్పులు తగ్గిపోతాయి.

6. చిలగడదుంపల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. అందువల్ల జీర్ణశక్తికి దోహదపడుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని తరచూ తీసుకుంటే మేలు జరుగుతుంది.

7. చిలగడదుంపలను తినడం వల్ల శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. జీర్ణాశయం, పేగుల్లో ఉండే అల్సర్లు తగ్గుతాయి.

8. చిలగడదుంపలు.. దుంపల జాతికి చెందినవి కనుక బంగాళాదుంపల్లాగే వీటిని తిన్నా కూడా షుగర్‌ పెరుగుతుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చిలగడ.. దుంప జాతికి చెందినది అయినప్పటికీ ఇందులో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. అలాగే దీని గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ కూడా తక్కువే. అందువల్ల వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగవు. షుగర్‌ కంట్రోల్‌లోనే ఉంటుంది. డయాబెటిస్‌ ఉన్నవారికి ఇవి చక్కని ఆహారం. వీటిని తినడం వల్ల క్లోమగ్రంథి ఇన్సులిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీంతో షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి. డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది.

9. అధిక బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఆహారంలో భాగం చేసుకోవచ్చు. వీటిని తక్కువ మొత్తంలో తీసుకున్నా జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది. అందువల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఇది అధిక బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.

10. పొగతాగేవారు, మద్యం సేవించే వారు ఆ అలవాట్లను మానేసేందుకు చిలగడదుంపలు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts