అల్సర్లకు ఆయుర్వేద చిట్కాలు.. సూచనలు..!

గుండెల్లో మంటగా ఉండడం, ఆహారం తినకపోతే మంటగా అనిపించడం, తిన్న తరువాత కడుపులో నొప్పి రావడం.. వంటివన్నీ అల్సర్‌ లక్షణాలు. దీన్నే యాసిడ్‌ పెప్టిక్‌ డిజార్డర్‌ అని పిలుస్తారు. ఆయుర్వేదంలో ఆమ్ల పిత్తమని అంటారు. మన జీర్ణాశయంలో జీర్ణంకాక ఉండిపోయిన పదార్థాల నుంచి తయారయ్యే విష పదార్థాల వల్ల అక్కడ పుండ్లు ఏర్పడుతాయి. పేగుల్లోనూ ఈ పుండ్లు ఏర్పడుతాయి. దీని వల్ల కడుపులో మంటగా అనిపిస్తుంది. గుండె కింది భాగంలో మంటగా ఉంటుంది. ఆహారం తిన్న తరువాత కడుపులో నొప్పి, వికారం, కొంత మందిలో తలనొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తుంటాయి.

ayurvedic home remedies for ulcers

ఈ లక్షణాలు ఉన్నవారు వెంటనే జాగ్రత్త పడాలి. వైద్యులను సంప్రదించిన తగిన చికిత్స తీసుకోవాలి. లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. అల్సర్‌ పుండ్లు తీవ్రతరం అయితే నొప్పి ఎక్కువగా ఉంటుంది. మంట తీవ్రత ఎక్కువవుతుంది. కొందరికి విరేచనాలు కూడా అవుతాయి. ఇక ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో లివర్‌ చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది.

ఎక్స్‌రే, స్కానింగ్‌, విరేచనం పరీక్షల వల్ల అల్సర్‌ ఉందీ, లేనిదీ తెలుస్తుంది. దీంతో డాక్టర్‌ సూచన మేరకు మందులను వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆహారాల విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా విపరీతమైన కారం, మసాలాలు ఉండే ఆహారాలు, నూనె పదార్థాలు, వేడి వేడిగా ఉండే పదార్థాలు, పానీయాలను తీసుకోవడం, మద్యం సేవించడం, పొగ తాగడం, విపరీతమైన శ్రమ చేయడం, ఆహారం తక్కువగా తినడం, తీవ్రమైన కోపం, విచారం వంటి వాటి వల్ల అల్సర్లు వస్తుంటాయి. కనుక ఈ చర్యలను మానుకోవాలి. దీంతో అల్సర్లు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

ఆక కొందరు ఆహారాన్ని ఎప్పుడు పడితే అప్పుడు తింటారు. కొందరు ఉపవాసాలు ఉంటారు. ఈ రెండూ మంచివి కావు. వేళకు భోజనం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలను తినాలి. కారం, మసాలాలను మానేయాలి. దీని వల్ల అల్సర్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.

1. ఒక గ్లాస్‌ వెన్న తీసిన మజ్జిగలో ఇనుప గరిట వేడి చేసి ముంచి అందులో ఒక టీస్పూన్‌ చక్కెర, కొద్దిగా జీలకర్ర, అల్లం కలిపి తాగితే కడుపులో మంట తగ్గుతుంది. ఉదయాన్నే పరగడుపునే ఈ మిశ్రమాన్ని తాగాలి.

2. శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, జీలకర్ర, ఉసిరికాయ, తెలుపు సైంధవ లవణం పొడి చేసి భోజనం చేశాక మజ్జిగతో తీసుకోవాలి. దీంతో కడుపు నొప్పి తగ్గుతుంది. మిరియాలను తక్కువగా, మిగిలిన పదార్థాలను సమాన భాగాల్లో తీసుకోవాలి.

3. సైంధవ లవణం, వెల్లుల్లి రసం, ఇంగువలను బాగా కలిపి కొద్ది మోతాదులో తీసుకోవాలి. కడుపు నొప్పి, మంట తగ్గుతాయి.

4. మారేడు గుజ్జు, బెల్లంలను సమానంగా కలిపి చిన్న ఉసిరికాయంత మాత్రలా చేసుకుని మజ్జిగతో తీసుకోవాలి. కడుపునొప్పి తగ్గుతుంది.

5. గంజి నీటిని అర గ్లాసు మోతాదులో తీసుకుని అందులో రెండు టీస్పూన్ల నెయ్యి వేసి కలిపి తాగాలి. కడుపులో ఉండే పుండ్లు తగ్గుతాయి.

6. వాల్‌ నట్స్, దానిమ్మ పండ్లు, వెలగ పండ్లను తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు.

7. శొంఠి, నువ్వులు, బెల్లంలను సమాన భాగాల్లో తీసుకుని కలిపి నూరి రోజూ చిన్న ఉసిరికాయంత మాత్రలుగా పాలతో తీసుకుంటే కడుపునొప్పి, ఇతర సమస్యలు తగ్గుతాయి.

కారం వస్తువులు, మసాలాలు, జున్ను, మినపపప్పు, పెరుగు, పుల్లని వస్తువులు కొంత కాలం మానేయాలి. మజ్జిగ, వేయించి వండిన మెత్తని అన్నం, పెసరకట్టు, దానిమ్మ రసం, బెల్లం, పాలు మేలు చేస్తాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts