డయాబెటిస్‌ ఉన్నవారు చక్కెరకు బదులుగా బెల్లం తినవచ్చా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">బెల్లంను రోజూ తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి&period; భోజనం చేశాక బెల్లం తింటే జీర్ణప్రక్రియకు సహకరిస్తుంది&period; బెల్లంలో అనేక పోషకాలు ఉంటాయి&period; అందువల్ల శరీరానికి పోషణ లభిస్తుంది&period; అయితే డయాబెటిస్‌ ఉన్నవారు చక్కెరకు బదులుగా బెల్లంను తినవచ్చా&comma; వద్దా &quest; అని చాలా మంది సందేహిస్తుంటారు&period; మరి దీనికి వైద్యులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-2345" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;04&sol;bellam&period;jpg" alt&equals;"diabetes unnavaru bellam thinavacha " width&equals;"1000" height&equals;"667" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చక్కెర&comma; బెల్లం&period;&period; రెండూ ఒకే పదార్థం నుంచి తయారవుతాయి&period; వాటి ద్వారా దాదాపుగా సమానమైన క్యాలరీలు లభిస్తాయి&period; రెండింటి గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ కూడా ఎక్కువే&period; కానీ చక్కెరను శుద్ధి ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు&period; బెల్లంను సహజసిద్ధంగా తయారు చేస్తారు&period; అందువల్ల బెల్లంలో పోషకాలు అలాగే ఉంటాయి&period; కనుక ఆరోగ్యం పరంగా పోలిస్తే చక్కెర కన్నా బెల్లమే మంచిదని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక డయాబెటిస్‌ ఉన్నవారు చక్కెరకు బదులుగా బెల్లంను వాడుకోవచ్చు&period; కానీ పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి&period; ఎక్కువైతే బెల్లం కూడా సమస్యలను కలగజేస్తుంది&period; కనుక డయాబెటిస్‌ ఉన్నవారు చక్కెరకు బదులుగా బెల్లంను ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు&period; కానీ తక్కువ మోతాదులో తీసుకుంటేనే ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ముదురు గోధుమ రంగులో ఉండే బెల్లం మంచిది&period; అత్యంత సహజసిద్ధమైన పద్ధతిలో తయారు చేస్తే బెల్లంకు ఈ రంగు వస్తుంది&period; కనుక దాన్ని తీసుకోవాలి&period; మిగిలిన ఏ రంగులో ఉండే బెల్లంను అయినా తినకూడదు&period; వాటిల్లో రసాయనాలు కలిసి ఉంటాయి&period; కనుక అనారోగ్య సమస్యలు వస్తాయి&period; ఇక ఆరోగ్యవంతులు కూడా బెల్లంను ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది&period; దీని వల్ల జీర్ణసమస్యలు ఉండవు&period; శ్వాసకోశ వ్యవస్థ శుభ్రమవుతుంది&period; ఇంకా అనేక ప్రయోజనాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts