ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గి మ‌న‌స్సు ప్ర‌శాంతంగా ఉండాలంటే వీటిని తీసుకోవాలి..!

నేటి త‌రుణంలో చాలా మంది డిప్రెష‌న్‌, ఒత్తిడి, ఆందోళ‌న వంటి మానసిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ప‌ని ఒత్తిడి, ఆర్థిక స‌మ‌స్య‌లు, అనారోగ్యాలు.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల ఒత్తిడి చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. అయితే కింద తెలిపిన ప‌లు ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గి మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. మాన‌సికంగా ఆరోగ్యంగా ఉంటారు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే…

take these foods to get rid of stress and be relaxed

1. స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీలు, రాస్ప్ బెర్రీలు వంటి బెర్రీ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల డిప్రెష‌న్ త‌గ్గుతుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. బెర్రీల‌లో ఉండే ఆంథో స‌య‌నిన్లు ఆందోళ‌న, ఒత్తిడిని త‌గ్గిస్తాయి. మ‌న‌స్సును ప్ర‌శాంతంగా ఉంచుతాయి.

2. ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను త‌గ్గించుకోవాలంటే డార్క్ చాకొలెట్‌ను త‌ర‌చూ తినాలి. దీన్ని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎండార్ఫిన్లు విడుద‌ల అవుతాయి. ఇవి సంతోషాన్ని క‌లిగిస్తాయి. మ‌న‌స్సును ప్ర‌శాంతంగా ఉంచుతాయి. డార్క్ చాకొలెట్‌ల‌ను తిన‌డం వ ల్ల మెద‌డుకు ర‌క్త స‌ర‌ఫ‌రా పెరుగుతుంది. వాపులు త‌గ్గుతాయి. మెద‌డు ఆరోగ్యంగా ఉంటుంది. మూడ్ మారుతుంది. సంతోషంగా ఉంటారు.

3. చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి మూడ్‌ను మారుస్తాయి. శ‌రీరంలో కొత్త క‌ణాలు ఉత్ప‌త్తి అయ్యేలా చూస్తాయి. చ‌ర్మం, వెంట్రుక‌ల‌ను సంర‌క్షిస్తాయి. రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ల‌భిస్తాయి. దీంతో మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి.

4. న‌ట్స్, విత్త‌నాల‌ను తిన‌డంవ‌ల్ల వాటిల్లో ఉండే ట్రిప్టోఫాన్ అన‌బ‌డే అమైనో యాసిడ్ మూడ్‌ను మారుస్తుంది. సెరొటోనిన్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది. ఇది మ‌న‌స్సును ప్ర‌శాంతంగా మారుస్తుంది. గుమ్మ‌డికాయ విత్త‌నాలు, నువ్వులు, పొద్దు తిరుగుడు విత్త‌నాలు, బాదం ప‌ప్పు, జీడిప‌ప్పు, వేరుశెన‌గ‌లు, వాల్‌న‌ట్స్ వంటివి తిన‌డం వ‌ల్ల మెద‌డు ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి.

5. పాల‌కూర‌లో మెగ్నిషియం ఉంటుంది. ఇది సెరొటోనిన్ స్థాయిల‌ను ప్ర‌భావితం చేస్తుంది. మూడ్‌ను మారుస్తుంది. ఉత్తేజాన్ని క‌లిగిస్తుంది. దీంతో డిప్రెష‌న్‌, ఆందోళ‌న త‌గ్గుతాయి.

ట్రిప్టోఫాన్ అధికంగా ఉండే కోడిగుడ్లు, పౌల్ట్రీ ఉత్ప‌త్తుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా శ‌రీరంలో సెరొటోనిన్ ఉత్ప‌త్తి పెరుగుతుంది. అలాగే అశ్వ‌గంధ చూర్ణం, మిరియాలు, మిర‌ప‌కాయ‌లు వంటి ఆహారాల‌ను తీసుకుంటే శ‌రీరంలో ఎండార్ఫిన్లు విడుద‌ల అవుతాయి. దీంతో మూడ్ మారుతుంది. మ‌న‌స్సు రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts