ఐఐటీ రూర్కీకి చెందిన బయో టెక్నాలజీ విభాగం ప్రొఫెసర్లు చింత గింజల్లో అద్భుతమైన యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయని తేల్చారు. దీంతో చికున్ గున్యా వంటి వ్యాధులను తగ్గించవచ్చని తెలిపారు. సైంటిస్టులు ఎప్పుడో చింత గింజలపై పరిశోధన చేసి ఆ వివరాలను వెల్లడించారు. అయితే నిజానికి చింత పండే కాదు, గింజల్లోనూ ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. వాటితో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. చింత గింజల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. చింత గింజల పొడితో దంతాలను తోముకుంటే దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. దంత క్షయం సమస్య నుంచి బయట పడవచ్చు. దంతాలు, చిగుళ్లు శుభ్రమవుతాయి. ఆరోగ్యంగా ఉంటాయి.
2. చింత గింజల పొడిని కొద్దిగా తీసుకుని దాన్ని నీటిలో కలిపి తాగితే అజీర్ణ సమస్య తగ్గుతుంది. బైల్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. ఈ గింజల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
3. చింత గింజల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి చర్మ ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. పేగులు, మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు.
4. డయాబెటిస్‌తో బాధ పడుతున్న వారికి చింత గింజలు మేలు చేస్తాయి. ఇవి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసేలా క్లోమ గ్రంథిని ప్రోత్సహిస్తాయి. చింత గింజల పొడిని నీటిలో కలిపి రోజూ తాగడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
5. చింత గింజల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. అందువల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365