Healthy Juice : పూర్వం మన పెద్దలు ఎంతో బలవర్ధకమైన ఆహారాన్ని తినేవారు. అందువల్ల వారికి పోషకాహార లోపం వచ్చేది కాదు. 100 ఏళ్లు వచ్చినా యువకుల్లా పనిచేసేవారు. అలాగే రక్తం బాగా ఉండేది. కంటి చూపు కూడా తగ్గేది కాదు. అన్ని విధాలుగా ఉత్సాహంగా ఉండేవారు. కానీ మనం మాత్రం 30 ఏళ్లు వచ్చే వరకు తీవ్రమైన నీరసంతో బాధపడుతున్నాం. మరోవైపు పోషకాహార లోపం. ఏ పని చేసేందుకు కూడా శక్తి ఉండడం లేదు. మరోవైపు రోగాలు. ఇలా మనం అనేక వ్యాధులతో సతమతం అవుతున్నాం. అయితే వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు గాను రోజూ ఒక గ్లాస్ జ్యూస్‌ను తాగాలి. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక క్యారెట్, ఒక బీట్‌రూట్‌ను తీసుకోవాలి. శుభ్రంగా కడిగి పైన ఉండే పొట్టును తీసి ముక్కలుగా కట్ చేయాలి. తరువాత ఒక ఉసిరికాయను తీసుకోవాలి. దాన్ని కూడా కడిగి ముక్కలు చేయాలి. లోపల ఉండే గింజను తీసేయాలి. ఉసిరికాయలు లభించకపోతే 30 ఎంఎల్ ఉసిరికాయ జ్యూస్‌ను వాడుకోవచ్చు. ఇది మనకు మార్కెట్‌లో లభిస్తుంది. ఇక ఇకప్పుడు ఒక టమాటాను, ఇంచు అల్లం ముక్కను తీసుకుని కడిగి ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు అన్ని ముక్కలను వేసి మిక్సీలో జ్యూస్‌లా పట్టాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని శుభ్రమైన వస్త్రంలో పోసి జ్యూస్‌ను పిండాలి. అనంతరం వచ్చే జ్యూస్‌లో కాస్త నల్ల ఉప్పు పొడిని కలపాలి. అంతే.. ఎంతో ఆరోగ్యకరమైన జ్యూస్ రెడీ అవుతుంది. దీన్ని రోజూ ఉదయం పరగడుపునే తాగాలి. ఇలా తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
పైన చెప్పిన జ్యూస్ మనకు ఆల్ రౌండర్‌లా పనిచేస్తుంది. దీన్ని రోజూ తాగడం వల్ల పైన చెప్పిన అనారోగ్య సమస్యలు అన్నీ మాయం అవుతాయి. ముఖ్యంగా కంటి చూపు పెరుగుతుంది. వయస్సు మీద పడుతున్నా కూడా కళ్లు మెరుగ్గా పనిచేస్తాయి. అలాగే నీరసం ఉండదు. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. బద్దకం అన్నది దరిచేరదు. దీంతోపాటు ఐరన్ అధికంగా లభిస్తుంది. దీంతో రక్తం తయారవుతుంది. ఫలితంగా రక్తహీనత నుంచి బయట పడవచ్చు.
ఇక ఈ జ్యూస్‌ను తాగడం వల్ల శరీరం మొత్తం క్లీన్ అవుతుంది. కిడ్నీలు, లివర్, జీర్ణవ్యవస్థ అన్నీ శుభ్రంగా మారుతాయి. శరీరంలో ఉండే వ్యర్థాలు అన్నీ బయటకు వెళ్లిపోతాయి. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. షుగర్ కంట్రోల్ అవుతుంది. బీపీ నియంత్రణలోకి వస్తుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. ఇలా ఒక్కటేమిటి సకల రోగాలు నయమవుతాయి. కనుక ఈ జ్యూస్‌ను తప్పకుండా రోజూ తాగాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.