హెల్త్ టిప్స్

Health Tips : హార్ట్ స్పెష‌లిస్ట్ చెప్పిన ఆరోగ్య సూత్రాలు ఇవి.. ఇలా చేస్తే చాలు..!

Health Tips : ఆరోగ్య నిపుణులు చెప్పిన సూత్రాలని పాటిస్తే క‌చ్చితంగా మన ఆరోగ్యం బాగుంటుంది. హార్ట్ స్పెషలిస్ట్ కొన్ని ఆరోగ్య సూత్రాలను చెప్పారు. మరి మీరు వాటిని ఆచరించి మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. మరి నిపుణులు చెప్పిన అద్భుతమైన చిట్కాల గురించి ఇప్పుడు చూసేయండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే రెండు గ్లాసుల‌ గోరువెచ్చని నీళ్లు తాగితే అంతర్గత అవయవాల్ని ఉత్తేజం చేయడానికి హెల్ప్ అవుతుంది. భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆహారం బాగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.

కాబట్టి భోజనం చేయడానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగండి, రక్తపోటును తగ్గించుకోవడానికి స్నానం చేయడానికి ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే మంచిది. ఇలా ఒక గ్లాసు నీళ్లు స్నానానికి ముందు తాగితే రక్తపోటు తగ్గుతుంది. రాత్రి మీరు నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే స్ట్రోక్ లేదా గుండెపోటును నివారించడానికి అవుతుంది. కొంత మంది రాత్రి నిద్ర లేచి నీళ్లు తాగుతూ ఉంటారు.

heart specialist told these tips for heart health

అయితే రాత్రి నిద్ర పోయిన తర్వాత మధ్యలో లేచి ఒక గ్లాసు నీళ్లు తాగితే కాళ్ల‌ తిమ్మిర్లని నివారించడానికి అవుతుంది. కాబట్టి రాత్రి నిద్ర మధ్యలో కూడా నీళ్లు తాగొచ్చు. ఇబ్బంది ఉండదు. కాలు కండరాలు సంకోచించడం, చార్లీ హార్స్ లేక దూడ తిమ్మిరి వంటివి సరిపడా నీళ్లు తీసుకోకపోవడం వలన వస్తాయి.

ప్రతి రోజు కూడా శరీరానికి సరిపడా నీళ్లు తాగితే ఎటువంటి రోగం కూడా ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి కచ్చితంగా రోజూ ఎనిమిది గ్లాసుల‌ వరకు నీళ్లు తాగడానికి ప్రయత్నం చేయండి. శరీరానికి సరిపడా నీళ్లు తాగడం వలన అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. వివిధ రకాల సమస్యల‌ బారిన పడకుండా మనం జాగ్రత్తగా ఉండొచ్చు. ఆరోగ్యంగా ఉండొచ్చు.

Admin

Recent Posts