Herbs And Spices Tea : ఈ హెర్బ‌ల్ టీని ఇలా త‌యారుచేసి చ‌లికాలంలో తాగండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Herbs And Spices Tea : చ‌లికాలం రానే వ‌చ్చింది. రోజురోజుకు ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గిపోతున్నాయి. చ‌లి నుండి ర‌క్షించుకోవ‌డానికి శ‌రీరం లోప‌లి నుండి వెచ్చ‌గా ఉండ‌డానికి చాలా మంది వేడి వేడిగా టీ ని తాగుతూ ఉంటారు. చ‌లికాలంలో మ‌న‌లో చాలా మంది రోజుకు 4 నుండి 5 సార్లు టీని తాగుతూ ఉంటారు కూడా. అయితే ఇలా టీని ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల చ‌లి నుండి ఉప‌శ‌మనం క‌లిగిన‌ప్ప‌టికి మ‌న ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది. మామూలు టీకి బ‌దులుగా చ‌లికాలంలో హెర్బ‌ల్ టీని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. హెర్బ‌ల్ టీని తాగ‌డం వ‌ల్ల చ‌లి ఉండి ఉప‌శ‌మ‌నం క‌ల‌గ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఈ టీని తాగ‌డం వల్ల చ‌లికాలంలో వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము.

మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఈ హెర్బ‌ల్ టీని ఎలా త‌యారు చేసుకోవాలి… అలాగే దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి…అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ హెర్బ‌ల్ టీని తయారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. దీనిని త‌యారు చేసుకోవ‌డానికి గానూ ఒక జార్ లో ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క‌ను, మూడు యాల‌కుల‌ను, ఐదు మిరియాలు వేసి మెత్త‌ని పొడిగా చేసుకోవాలి. త‌రువాత గిన్నెలో గ్లాసున్న‌ర నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే ముందుగా త‌యారు చేసుకున్న పొడితో పాటు అర టీ స్పూన్ అశ్వ‌గంధ పొడి, పావు టీ స్పూన్ శొంఠిపొడి వేసి10 నిమిషాల పాటు మ‌రిగించాలి. త‌రువాత ఈ టీని వ‌డ‌క‌ట్టి క‌ప్పులో పోసుకుని తాగాలి. ఇలా రోజుకు ఒక క‌ప్పు చొప్పున ఈ టీని తాగ‌డం వల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Herbs And Spices Tea make in this way and drink daily in winter
Herbs And Spices Tea

ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. గ్యాస్, అజీర్తి, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఈ హెర్బ‌ల్ టీని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. చ‌లికాలంలో వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. జలుబు, ద‌గ్గు, గొంతునొప్పి వంటి ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. ఈ టీని రాత్రి స‌మ‌యంలో తాగ‌డం వ‌ల్ల నిద్ర‌లేమి స‌మ‌స్య త‌గ్గుతుంది. చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఈ టీని తాగ‌డం వ‌ల్ల సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఈ టీని తాగ‌డం వల్ల శ‌రీరంలో అధికంగా ఉండే కొవ్వు క‌రిగిపోతుంది. ఈ టీని తాగ‌డం వ‌ల్ల ఒత్తిగి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. ఈ విధంగా చ‌లికాలంలో హెర్బ‌ల్ టీని త‌యారు చేసి తీసుకోవ‌డం వల్ల చ‌లి నుండి ఉప‌శ‌మ‌నం క‌ల‌గ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts