ప్రస్తుత కాలంలో డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ వ్యాధితో బాధపడే వారు వారి ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడే వారు తీసుకునే ఆహారంలో అధికంగా కార్బోహైడ్రేట్లు, చక్కెరలు లేకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా అధిక కొవ్వు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం కూడా ఎన్నో సమస్యలకు కారణమవుతుంది.
డయాబెటిస్ తో బాధపడే వారు అధికంగా కొవ్వు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ముందుగా గుండెపై ప్రభావం చూపుతుంది. ఇందులో మనకు మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ రెండు ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి, రక్తప్రసరణ సక్రమంగా నిర్వర్తించడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మనం వంట కోసం ఉపయోగించే నూనెలో కొన్ని ముఖ్యమైన కొవ్వులు ఉంటాయి. ఇతర వంటనూనెల కన్నా కొబ్బరి నూనె మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుందని చెప్పవచ్చు. వైద్యపరంగా కొబ్బరి నూనె ప్రయోజనాల గురించి ఇంకా అధ్యయనాలు జరుగుతున్నప్పటికీ, ఈ నూనె ఉపయోగం ఇప్పటికే ఎక్కువ ప్రాచుర్యం పొందింది.
1. వంట చేయడం కోసం కొబ్బరి నూనెను ఇతర పదార్థాలలో కలిపి ఉపయోగించవచ్చు. ఈ నూనెలో జీర్ణక్రియను ఉత్తేజపరిచే ఆహార పదార్థాలు ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కొబ్బరి నూనెను వంటలలో ఉపయోగించడం వల్ల కొంత పరిమాణంలో తిన్నప్పటికీ కడుపు నిండిన తృప్తి కలుగుతుంది. దీంతో ఎక్కువ ఆహారం, ఇతర స్నాక్స్ వంటి పదార్థాలు తినకుండా ఉంటారు. దీంతో సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. శరీర బరువు తగ్గాలనుకొనే వారు కొబ్బరినూనెను ఉపయోగించడమే కాకుండా ఇతర వ్యాయామాలు కూడా చేయాలి.
2. డయాబెటిస్ తో బాధపడే వారు కొబ్బరి నూనెను తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగించవచ్చు. కొబ్బరి నూనె మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంతోపాటు మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.
3. డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారిలో వ్యాధి ప్రభావం అన్ని అవయవాలపై పడుతుంది. ఇది ద్రవాలు, ఇతర జీర్ణక్రియ ఎంజైముల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. కొవ్వులు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి ఆలస్యం అవుతుంది. కనుక కొబ్బరినూనెలో ఉండే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్లు ఆహార పదార్థాలను సులభంగా జీర్ణం చేయడానికి దోహదపడతాయి.
4. ట్రయాసిల్ గ్లిసరాల్ తో కూడిన నూనెలు బరువును నియంత్రించడానికి దోహదపడతాయని పలు అధ్యయనాల్లో నిరూపించబడింది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం 40 మంది అధిక బరువు గల స్త్రీ పురుషులిద్దరిలో కొంతమందికి ట్రయాసిల్ గ్లిసరాల్ డైట్ ఇవ్వగా మరికొంతమందికి ఆలివ్ నూనె డైట్ ఇచ్చారు. ఆలివ్ నూనె తిన్న వారిలో కన్నా ట్రయాసిల్ గ్లిసరాల్ నూనెలు తీసుకున్నవారిలో బరువు గణనీయంగా తగ్గిందని గుర్తించారు. క్రమం తప్పకుండా ఈ నూనెను ఉపయోగించడం వల్ల బరువును తగ్గించుకోవచ్చని నిరూపించబడినది.
5. డయాబెటిస్ తో బాధపడే వారు కొబ్బరి నూనెను తీసుకోవటంవల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365