Hibiscus Flower Tea : మందార పువ్వులను మహిళలు అలంకరణ కోసం లేదా పూజ కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే వాస్తవానికి ఆయుర్వేద ప్రకారం ఈ పువ్వుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ పువ్వులతో తయారు చేసే టీ ని రోజుకు ఒక కప్పు మోతాదులో తాగినా చాలు.. అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇక మందార పువ్వులతో టీ ని ఎలా తయారు చేయాలి.. దీంతో ఏమేం లాభాలు కలుగుతాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మందార పువ్వులను రెండు లేదా మూడు సేకరించి నీడలో ఎండబెట్టి పొడి చేయాలి. తరువాత ఆ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక కప్పు నీటిలో వేసి మరిగించాలి. ఐదు నిమిషాల పాటు మరిగించిన తరువాత టీ ని వడకట్టాలి. అందులో రుచి కోసం తేనె, నిమ్మరసం కలిపి తాగవచ్చు. దీన్ని ఇలా తయారు చేసుకుని రోజుకు ఒక కప్పు మోతాదులో తాగినా చాలు.. అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
1. మందార పువ్వులతో టీ తయారు చేసుకుని తాగడం వల్ల శరీరంలో వాపులు తగ్గుతాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి మేలు జరుగుతుంది.
2. ఈ టీని సేవించడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.
3. కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ అధికంగా ఉన్నవారు ఈ టీని తాగడం వల్ల ఆయా సమస్యలు తగ్గుతాయి.
4. అధిక బరువు ఉన్నవారు మందార పువ్వుల టీని తాగితే బరువు త్వరగా తగ్గుతారు. అలాగే పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
5. లివర్ సమస్యలు ఉన్నవారు రోజూ మందార పువ్వుల టీని తాగితే లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. లివర్‌లోని వ్యర్థాలు బయటకు పోయి లివర్ శుభ్రంగా మారుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.