Hing With Milk : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే ఇంగువను ఉపయోగిస్తున్నారు. దీన్ని వంటల్లో ఎక్కువగా వేస్తుంటారు. అయితే ఇంగువ వంటకాలకు రుచిని అందించడమే కాదు.. మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా ఇస్తుంది. కనుక దీన్ని తరచూ తీసుకోవాలి. అయితే రోజూ వంటల్లో ఇంగువను వేయలేమని అనుకునేవారు.. దాన్ని పాలలో కలిపి తాగవచ్చు. దీని వల్ల కూడా మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక పాలలో ఇంగువను ఎలా కలిపి తాగాలి.. దీంతో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక గ్లాస్ నీటిలో ఒక గ్రాము ఇంగువను వేసి 72 గంటల పాటు నానబెట్టాలి. దీంతో ఇంగువ పూర్తిగా నీటిలో కరుగుతుంది. అలా కరిగిన నీటిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని వాటిని 200 ఎంఎల్ గోరు వెచ్చని పాలలో కలపాలి. ఇలా ఇంగువను కలిపిన పాలను రోజూ రాత్రి నిద్రకు ముందు తాగాలి. దీని వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
ఇంగువను పైన చెప్పిన విధంగా పాలలో కలిపి తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణవ్యవస్థ మొత్తం శుభ్రంగా మారుతుంది. మలబద్దకం, గ్యాస్, అజీర్ణం, కడుపులో మంట వంటి సమస్యలు పోతాయి. అలాగే కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, వెక్కిళ్లు కూడా తగ్గుతాయి.
ఇలా ఇంగువను తీసుకోవడం వల్ల అల్సర్లు నయమవుతాయి. ఐబీఎస్ అనే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా ఇంగువతో అనేక లాభాలను పొందవచ్చు.