హెల్త్ టిప్స్

మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకుంటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

చాలామంది, ప్రయాణాల అప్పుడు కానీ లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు కానీ ఫోన్ చూస్తున్నప్పుడు కానీ, టాయిలెట్ వచ్చినా, ఆపేసుకుంటూ ఉంటారు. కానీ అసలు మూత్రని ఆపుకోవడం మంచిది కాదు. మూత్రాన్ని ఆపుకుంటే, పలు సమస్యలు కలుగుతాయి. బాగా నీళ్లు తాగుతూ, మూత్ర విసర్జన చేస్తూ ఉండాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. లేకపోతే ఎంతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మూత్ర విసర్జనని మాత్రం అస్సలు ఆపుకోకండి. ఇది ఒక సహజ ప్రక్రియ. కానీ, ఏదైనా కారణాల వలన చాలామంది మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటారు.

ఎక్కువసేపు అలా బిగబట్టి ఉంచడం మంచిది కాదు. ఎక్కువ మూత్రాన్ని ఆపడం వలన, 15% మందికి ప్రోస్టేట్ సమస్య, కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలు, పైల్స్ ఇలాంటివి కలుగుతున్నాయని సర్వేలో చెప్పబడింది, మూత్రంలో హానికరమైన బాక్టీరియా ఉంటుంది. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపితే, బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతుంది మూత్రశయం సంచిలా ఉంటుంది, హోల్డ్ చేస్తే, ఇది కిందకి జారిపోతుంది కూడా.

holding urine for longer times is not healthy holding urine for longer times is not healthy

దీంతో మూత్రం పూర్తిగా విడుదల కాదు. కొన్ని సార్లు అయితే మూత్రాశయం పగిలిపోయే అవకాశం కూడా ఉంది. ఎక్కువసేపు మూత్రాన్ని హోల్డ్ చేసి పెట్టడం వలన, నొప్పి కూడా కలుగుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు సమస్యలు కూడా, చాలా మంది ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఎక్కువ సేపు మూత్రం ని హోల్డ్ చేసి పెట్టడం వలన, మూత్రశయం బలహీనంగా మారిపోతుంది. నవజాత శిశువులకి మూత్రశయం చిన్నగా ఉంటుంది. అందుకనే, పదేపదే మూత్ర విసర్జన చేస్తారు. కాలక్రమేణా పిల్లలు రోజుకి 10 నుండి 12 సార్లు వెళ్లే అవకాశం ఉంది. పెద్దలైతే రోజు కి ఆరు సార్లు మూత్ర విసర్జన చేయాలి. కనుక, బాగా నీళ్లు తాగుతూ ఉండాలి. మూత్రాన్ని ఆపుకోకండి. క్యాన్సర్ వంటి ప్రమాదాలు కలగొచ్చు.

Admin

Recent Posts