Rock Sugar : పటిక బెల్లం.. ఇది మనందరికీ తెలిసిందే. పటిక బెల్లం కూడా చూడడానికి అచ్చం చక్కెర లాగే ఉంటుంది. దీనిని కూడా చెరుకు రసంతోనే తయారు చేస్తారు. పటిక బెల్లాన్ని కలకండ, మిశ్రి, కండ చక్కెర వంటి వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. పటిక బెల్లంలో మన శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ ఉంటాయి. దీనిని వాడడం వల్ల శరీరానికి అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఎటువంటి మందులను వాడాల్సిన అవసరం లేకుండా పటిక బెల్లాన్ని ఉపయోగించి మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదంలో కూడా పటిక బెల్లాన్ని అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో, ఔషధాలను తయారు చేయడంలో వాడుతూ ఉంటారు.
పటిక బెల్లాన్ని వాడడం వల్ల కలిగే ప్రయోజనాలతోపాటు ఎలాంటి అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. తరచూ వేడి చేసే వారు పటిక బెల్లాన్ని పొడిలా చేసి నీటిలో కలుపుకుని తాగడం వల్ల వేడి తగ్గుతుంది. శరీరానికి చలువ చేసే గుణం పటిక బెల్లానికి ఉంది. కండ్ల కలకలను తగ్గిండంలో కూడా పటిక బెల్లం సహాయపడుతుంది. పటిక బెల్లాన్ని నీటిలో కరిగించి ఆ నీటిని వడకట్టి మూడు చుక్కల చొప్పున కళ్లలో వేసుకోవడం వల్ల కండ్ల కలకల సమస్య తగ్గుతుంది. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.
పటిక బెల్లాన్ని నోట్లో వేసుకుని చప్పరించడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. అంతే కాకుండా దంతాలు, చిగుళ్ల సమస్యలు కూడా తగ్గుతాయి. వయస్సు పైబడడం వల్ల వచ్చే మోకాళ్ల నొప్పులను తగ్గించడంలోనూ పటిక బెల్లం ఉపయోగపడుతుంది. పటిక బెల్లం పొడిని పాలలో వేసుకుని తాగడం వల్ల నొప్పులు తగ్గడమే కాకుండా ఎముకలు దృఢంగా తయారవుతాయి. అనారోగ్య సమస్యలను మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీని, ఆర్థిక సమస్యలను తగ్గించడంలోనూ పటిక బెల్లం సహాయపడుతుంది.
మంగళ వారం రోజు ఉదయం 8 నుండి 10 గంటల మధ్య గుప్పెడు పటిక బెల్లాన్ని నల్లని వస్త్రంలో ఉంచి రాగి వైర్ తో గట్టిగా కట్టి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టడం వల్ల ఇంట్లో ఉండే సమస్యలు తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుందని పండితులు చెబుతున్నారు. పటిక బెల్లాన్ని వాడడం వల్ల బాలింతలలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. తరచూ నీరసంగా ఉండేవారు పటిక బెల్లాన్ని తీసుకోవడం వల్ల నీరసం తగ్గి బలంగా, చురుకుగా తయారవుతారు.
వేడి వేడి పాలలో పటిక బెల్లాన్ని కలుపుకుని తాగడం వల్ల గొంతు బొంగురు సమస్య తగ్గుతుంది. తరచూ జలుబుతో బాధపడే వారు నిప్పుల మీద పటిక బెల్లం పొడి, కొద్దిగా పసుపు వేసి ఆ వాసనను పీల్చడం వల్ల జలుబు తగ్గుతుంది. దొండకాయలను పటిక బెల్లంతో కలిపి దంచుకుని తినడం వల్ల దగ్గు తగ్గుతుంది. కామెర్లను తగ్గించడంలో కూడా పటిక బెల్లం ఎంతో దోహదపడుతుంది. సొరకాయ రసంలో పటిక బెల్లం చూర్ణాన్ని కలుపుకుని రెండు పూటలా వారం రోజుల పాటు తాగడం వల్ల కామెర్లు తగ్గుతాయి.
పుదీనా రసంతో పటిక బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల వెక్కిళ్లు తగ్గుతాయి. పటిక బెల్లం చూర్ణం, మిరియాల పొడి, శొంఠి పొడిని కలిపి పూటకు మూడు గ్రాముల చొప్పున ఆరు గ్రాముల నెయ్యితో కలిపి తీసుకోవడంవల్ల అతి మూత్ర వ్యాధి తగ్గుతుంది. పటిక బెల్లాన్ని నూరి తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఆస్తమా తగ్గుతుంది. పటిక బెల్లాన్ని గసగసాలతో నూరి వెన్నతో కలిపి తీసుకోవడం వల్ల గర్భిణీలలో వచ్చే కడుపు నొప్పి, రక్త స్రావం, గర్భ వాతం వంటి సమస్యలు తగ్గుతాయి.
అరటి పండును పటిక బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల నీళ్ల విరేచనాలు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పటిక బెల్లాన్ని వాడడం వల్ల ఎటువంటి దుష్పభ్రావాలు లేకుండా అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.