Honey And Almonds : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదంపప్పు కూడా ఒకటి. బాదం పప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. బాదంపప్పులో ఉండే పోషకాలు మన శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడతాయి. సాధారణంగా ఈ బాదంపప్పును తీపి వంటకాల తయారీలో వాడడంతో పాటు నానబెట్టి కూడా తీసుకుంటూ ఉంటాము. అయితే ఇలా కాకుండా బాదంపప్పును తేనెతో కలిపి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. బాదంపప్పును, తేనెను కలిపి తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాదంపప్పును తేనెను కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి.
శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. తరచూ ఇన్పెక్షన్ ల బారిన పడే వారు బాదంపప్పును, తేనెను కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే బాదంపప్పు, తేనెనుయ కలిపి తీసుకోవడం వల్ల శరీరం బలంగా, ధృడంగా తయారవుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు బాదంపప్పును, తేనెను కలిపి తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. బాదంపప్పు, తేనెను కలిపి తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి త్వరగా వేయకుండా ఉంటుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు.
అయితే బాదంపప్పును, తేనెను కలిపి ఎలా తీసుకోవాలి.. ఎంత మోతాదులో తీసుకోవాలి… ఎంత మోతాదులో తీసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మనకు కావల్సినన్ని బాదంపప్పులను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత వీటిని తడి లేకుండా ఆరబెట్టి ఒక గాజు సీసాలోకి తీసుకోవాలి. తరువాత ఈ బాదంపప్పు మునిగే వరకు తేనె పోసి గాలి తగలకుండా మూత పెట్టాలి. ఇలా తేనెలో నానబెట్టిన బాదంపప్పును రోజూ ఉదయం పరగడుపున రెండు చొప్పున తీసుకోవాలి. ఇలా నానబెట్టిన బాదంపప్పును మనం వారం రోజుల పాటు తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల బాదంపప్పు, తేనెలో ఉండే పోషకాలను రెండింటిని పొందవచ్చు. అలాగే శరీరం ధృడంగా అవ్వడంతో పాటు అనేక ప్రయోజనాలను కూడా పొందవచ్చు.