ఈరోజుల్లో ఆల్కహాల్ సేవించడం ప్రతి ఒక్కరికి ఫ్యాషనైపోయింది. వీకెండ్ అనే పదం అందుబాటులోకి వచ్చిన తర్వాత శని, ఆదివారాలు వస్తే కచ్చితంగా స్నేహితులతో కలిసి మందు కొట్టాలి, ఎంజాయ్ చేయాలి అనే ఆలోచనలోనే నేటి యువత ఉంది. అయితే కొందరు బీర్లు తాగుతుంటారు. దీనిలో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండడంతో పురుషులే కాకుండా మహిళలు కూడా బీర్లు తాగుతున్నారు. సాధారణంగా బీర్లలో 4 నుండి 5 శాతం ఆల్కహాల్ ఉంటుంది.. చాలా మంది ప్రతిరోజూ 1-2 క్యాన్ల బీర్ తాగడానికి ఇష్టపడతారు. అదే సమయంలో ఇది ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావాన్ని చూపదని నమ్ముతారు. చాలా మంది ప్రతిరోజూ బీరు డబ్బాలు తాగుతుంటారు. అయితే రోజుకు ఎంత బీరు తాగాలన్నదే ఇప్పుడు ప్రశ్న.
కాలేయం కొత్త కణాలను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, దీని వల్ల కొంత కాలం తరువాత కొత్త కణాలు ఏర్పడతాయి, కాని ఆల్కహాల్ నిరంతరం అధికంగా తీసుకుంటే, అది కొత్త కణాలను తయారు చేసే కాలేయ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది ఇది కాలేయం దెబ్బతినడం ప్రారంభిస్తుంది. ఆల్కహాల్ అనేక కాలేయ సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. మందులో కంటే బీర్ లో ఆల్కహాల్ తక్కువగా ఉంటుందని, కానీ మన శరీరంలో ఆల్కహాల్ పరిమాణం సురక్షితం కాదని డాక్టర్ అరోరా చెప్పారు. ముఖ్యంగా కాలేయానికి బీరు తాగే అలవాటు మంచిది కాదు.బీర్ ఎక్కువగా తాగడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో బ్లడ్ షుగర్ హెచ్చుతగ్గుల సమస్యలు తలెత్తుతాయి. పొట్టకు సంబంధించిన సమస్య పెరుగుతుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ఒక చుక్క ఆల్కహాల్ కూడా శరీరానికి సురక్షితమైనదిగా పరిగణించబడదు. ఆల్కహాల్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. బీర్ మరియు మద్యంలో ఆల్కహాల్ ఉంటుంది, ఇది విషపూరిత పదార్ధం మరియు ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. బీరు ఎక్కువగా తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుతో తీవ్రమైన వ్యాధులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది. బీర్ వల్ల బరువు పెరగడం జరుగుతుంది.పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వులు చాలా జిగటగా ఉంటాయి. వాటిని విసెరల్ ఫ్యాట్స్ అంటారు. ఈ కొవ్వులు శరీరంలోని హార్మోన్లను ప్రభావితం చేస్తాయి. ఈ కొవ్వులు మెటబాలిక్ సిండ్రోమ్, టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులు .క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.