హెల్త్ టిప్స్

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్ల‌ను రోజూ ఎంత మోతాదులో తాగాలి..?

కిడ్నీ వ్యాధులను నివారించుకోవాలంటే, నీరు తాగటం అవసరం. నీరు బాగా తాగితే బ్లాడర్, మూత్రకోశ వ్యాధులు కూడా నయం చేసుకోవచ్చు. నీరు శరీరంలోని ఉప్పు, యాసిడ్ స్ధాయిలను సమన్వయపరచి అన్నిరకాల నొప్పులు, మంటలు తగ్గిస్తుంది. నీరు వ్యాధి కలిగించే బాక్టీరియాను బయటకు పంపేస్తుంది. శరీరానికి ఇన్ని రకాలుగా ఉపయోగపడే నీరు ఎంత తాగాలి? ఎంత తాగితే కిడ్నీలకు అధికం అవుతుంది? కిడ్నీ ఆరోగ్యంగా వుండాలంటే ఎంత నీరు సరిపోతుంది? అనే అంశాలను వివరిస్తున్నాం పరిశీలించండి.

సాధారణంగా శరీరానికి 8 నుండి 10 గ్లాసుల నీరు సరిపోతుంది. కాని అధి అధికమైతే కొన్ని మూత్రపిండ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. శరీరంలోని ద్రవాలను అర్జనైన్ వేసో ప్రెసిన్ హర్మోను నియంత్రిస్తూంటుంది. మూత్రపిండాలనుండి బయటకు వెలువడే మలినాలు ఈ హార్మోను నియంత్రణలో వుంటాయి. నీరు కనుక తక్కువ మొత్తంలో తీసుకుంటే అది ఇంకా ప్రమాదకరం. అది మూత్ర కోశ వ్యాధులకు కూడా దారితీస్తుంది. నీరు తక్కువ తాగే వారికి కిడ్నీలలో చిన్నపాటి రాళ్ళు ఏర్పడతాయి. వీటినే కిడ్నీ స్టోన్స్ అంటారు. ఇది అనేక పెద్ద ఆరోగ్య సమస్యలకు కూడా దోవ తీస్తుంది.

how much water you should drink per day for kidneys health

కనుక, నీరు ఎంత మొత్తంలో అయితే కిడ్నీలు సమంగా ఫిల్టర్ చేయగలవు? కిడ్నీ సమర్ధత ఎల్లపుడూ ఒకే విధంగా వుండదు. నీరు ఎక్కువ తాగితే మలినాలు బయటకు పోతాయని కిడ్నీ ఆరోగ్యం బాగా వుంటుందనే అభిప్రాయం నూటికి నూరు శాతం సరైనది కాదు. కొంత నీరు కిడ్నీ ఫిల్టరింగ్ చేసినా అధికమైన నీరు దాని పనిని బలహీన పరుస్తుంది. ఆరోగ్యకరమైన అలవాటు అంటే, మీ నోరు ఎండిన ప్రతిసారి నీరు తాగండి. ఇంకా దీనిపట్ల అవగాహన కావాలంటే డాక్టర్ సలహా తీసుకోండి.

Admin

Recent Posts