హెల్త్ టిప్స్

ఒత్తిడిని జ‌యించాలంటే.. ఈ సూత్రాల‌ను పాటించాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పని ఒత్తిడి&comma; వ్యక్తిగత సంబంధాలు&comma; పెళ్లి లేటవ్వడం&comma; సంతాన సమస్యలు&comma; ఉద్యోగం కోల్పోవడం&comma; కుటుంబీకుల ఆదరాభిమానాలు లేకపోవడం వంటివన్నీ మానసిక ఒత్తిడిని కలిగించేందుకు కారణమవుతుంటాయి&period; వ్యక్తులను బట్టి ఇతర కారణాలు కూడా ఉండొచ్చు&period; తీవ్రమైన మానసిక‌ ఒత్తిడిని గుర్తించి ముందుగానే చికిత్స తీసుకోవాలి&period; లేదంటే యాంగ్జైటీ&comma; డిప్రెషన్ ను కలిగించి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది&period; మీరు మీ జీవితంలో ఒత్తిడి నుంచి విముక్తులు కావాలంటే అది మీ చేతుల్లోనే ఉంది&period; దీని నుంచి బయటపడేందుకు మీ మైండ్ నే సాయంగా తీసుకోండి&period; ఆలోచన తీరులో కొన్ని మార్పులు చేసుకుంటే దీని నుంచి బయటపడటం ఎంతో సులభం&period; జీవితంలో ప్రతి సంఘటన మనకు ఏదో ఒక పాఠం నేర్పుతుంది&period; అందులో దాగి ఉన్న ప్రయోజనాల మీదనే ఫోకస్ పెట్టి నెగిటివిటీని తీసి పారేయండి&period; దీంతో మీ మనసు సానుకూలంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గతంలో చేసిన తప్పులను&comma; పొరపాట్లను గుర్తుతెచ్చుకుని బాధపడకండి&period; మీ చేతుల్లో ఉన్న ప్రతి క్షణాన్ని ఆనందంగా జీవించే ప్రయత్నం చేయండి&period;మీ లైఫ్ ను ఇతరులతో పోల్చుకోవడం ఇప్పుడే మానుకోండి&period; ఇది మీ జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది&period; ఎవరికి వారే ప్రత్యేకం అన్న విషయం గుర్తుంచుకోండి&period; మిమ్మల్ని నిరంతరం విమర్శించే వారే మీ నిజమైన స్నేహితులని గుర్తుంచుకోండి&period; మీకు బాధ కలిగించే విషయాలను&comma; వ్యక్తులను మర్చిపోవడానికి ప్రయత్నించండి&period; హ్యాపీగా ఉంటారు&period; అన్ని సమస్యలను ఒకేసారి పరిష్కరించడానికి ప్రయత్నించి గందరగోళం చెందకండి&period; ఒక్క సారి ఒక్క విషయం మీద మాత్రమే ఫోకస్ చేయండి&period; ఒత్తిడి లేకుండా ఉంటారు&period; వీలైనంత వరకు ఇతులకు సహాయం చేయడం ద్వారా మీరు మీ చింతలను మరచిపోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74388 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;stress-1&period;jpg" alt&equals;"how to live stress free life " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ చేతుల్లో ఉన్నవి మాత్రమే మీరు మార్చగలరు&period; మార్చలేని విషయాలను గురించి ఎంత ఆలోచించినా ప్రయోజనం ఉండదు&period; వాటి కోసం మీ ఎనర్జీని పోగొట్టుకోకండి&period; గడిచిపోయిన కాలం తిరిగి రాదు&period; అందుకే కాలం విలువను గుర్తుంచుకోండి&period; ఈ నిమిషం ఎలా జీవిస్తున్నారనే దానిపైనే మనసును లగ్నం చేయండి&period; గతాన్ని పదే పదే తవ్వుకోవడం&comma; భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం రెండూ మంచివి కావు&period; ప్రపంచమే ఓ జగన్నాటకం&period; అందులో ఒక్కొక్కరిదీ ఒక్కో పాత్ర&period; మనమంతా నటులమే&period; మీరు మీ పాత్రను సరిగ్గా పోషిస్తున్నారా లేదా చూసుకోండి&period; ఇతరుల పనితీరు మిమ్మల్ని బాధించకూడదు&period; ఇతరులు మనకు నచ్చినట్టుగా ఉండటం లేదనే బాధే కాలక్రమేణా మనలో ఒత్తిడిని కలుగజేస్తుంది&period; జీవితంలో ఎవరికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యం వారికిస్తూ ముందుకు కదిలిపోతూ ఉండాలి&period; ఆగి ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడే ఆగిపోతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనసును అసూయ‌&comma; ద్వేషాలతో మండించకండి&period; మీకు నచ్చిన దైవాన్ని ధ్యానించుకోండి&period; వారి మార్గంలో నడవండి&period; మనసుకు అపారమైన శాంతి కలుగుతుంది&period; దాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు&period; ఆనందం ఎక్కడో ఉండదు&period; మనలోనే ఉంటుంది&period; దాన్ని ఇతరుల నుంచి కోరుకోవడం అమాయకత్వం&period; మీకున్న దాంట్లో పంచడంలోనే అసలైన సంతోషం ఉంది&period; ఎప్పుడూ ఇచ్చేవారుగా ఉండేందుకే ప్రయత్నించండి&period; కర్మ సిద్దాంతం ప్రకారం&period;&period; మీరు ఏదైనా సమస్యను తీవ్ర స్థాయిలో ఎదుర్కోవలసి వచ్చినప్పుడు మీ గత కర్మలు కరిగిపోతున్నాయని&period;&period; దాని నుంచి మీరు విముక్తి పొందుతున్నారని అర్థం&period; మీలో మీకే తెలియకుండా ఉండే ఆ చిన్న పాటి అహాన్నికూడా త్యాగం చేసేయండి&period; వచ్చినప్పుడు ఏం తీసుకురాం&period;&period; వెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్లమని గుర్తుంచుకోండి&period; మీ సమస్యలన్నింటినీ మీ ఇష్టదైవానికి అప్పజెప్పి మీరు చింతను వదిలి సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించండి&period; ప్రతిరోజూ కనీసం కొద్దిసేపు ధ్యానం&comma; లేదా ఇష్టదైవ నామస్మరణ చేసుకోవాలి&period; ఇది మీ మానసిక&comma; శారీరక ఆరోగ్యంలో ఎన్నో మార్పులను తీసుకురాగలదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts