Tea And Coffee : ఉదయం నిద్రలేవగానే చాలా మందికి వ్యాయామం చేసే అలవాటు ఉంది. వ్యాయామం చేస్తే మానసిక మరియు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే చాలా మందికి టీ, కాఫీలను తాగే అలవాటు కూడా ఉంటుంది. అయితే పరగడుపున టీ, కాఫీలను తాగితే శరీరానికి హాని కలుగుతుంది. ఈవిషయం మనలో చాలా మందికి తెలిసి ఉండదు. కానీ మీరు విన్నది నిజమే. ఇలా పరగడుపున టీ, కాఫీలను తాగే వారి శరీరం అనారోగ్యాల బారిన పడినట్టే. పరగడుపున టీ తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పరగడుపున టీ, కాఫీలను తాగడం వల్ల కలిగే అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం పాలు పోసి తయారు చేసిన టీ, కాఫీలనే కాదు తాగే టీ ఎటువంటిదైనా సరే అంటే గ్రీన్ టీ నుండి బ్లాక్ టీ వరకు ఏ టీ తాగినా సరే మనం అనారోగ్యాల బారిన పడాల్సిందే.
చాలా మంది ఉదయాన్నే గ్రీన్ టీ తాగితే చాలా మంచిదని భావిస్తారు. కానీ ఏ టీ తాగినా సరే మనం ఇబ్బందులకు గురి కావాల్సిందే. టీ లో ఉండే పదార్థాలు పొట్టలో ఉండే ఆమ్లాలతో కలవడం ఎసిడిటీ సమస్య అధికమవుతుంది. అలాగే గ్యాస్ సమస్య కూడా తలెత్తుతుంది. పాలతో చేసిన టీ తాగడం వల్ల మనం అధిక సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. టీ, కాఫీలను తాగడం వల్ల కడుపులో ఎసిడిటీ పెరుగుతుంది. ఇది గ్యాస్ ను పెంచుతుంది. అలాగే మన రక్తంలోకి ప్రవేశించి కొద్ది రోజుల్లోనే మన శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. దీంతో హార్ట్ ఎటాక్, లో బీపీ, హై బీపీ సమస్య వంటి సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అందుకే ఖాళీ కడుపున టీ ని తాగకూడదు. అధిక బరువు సమస్యతో బాధపడే వారు అస్సలే తీసుకోకూడదు. చాలా మంది కొవ్వు పదార్థాలను తినడం వల్లే లావు అవుతున్నామని అనుకుంటారు. కానీ ఖాళీ కడుపున టీ తాగితే కూడా బరువు పెరిగే అవకాశం ఉంది.

ఇలా టీ ని తాగడం వల్ల నేరుగా జీర్ణవ్యవస్థ పై చెడు ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో మెటబాలిజం రేటు కూడా తగ్గుతుంది. దీని వల్ల పొట్ట పెరగడంతో పాటు బరువు కూడా పెరుగుతారు. లావు అవ్వకూడదు అనుకున్న వారు పరగడుపున టీ ని అస్సలు తాగకూడదు. పైల్స్ సమస్యతో బాధపడే వారు కూడా ఖాళీ కడుపున టీ, కాఫీలను తాగకూడదు. టీ, కాఫీలను తాగడం వల్ల పైల్స్ సమస్య వచ్చే అవకాశం కూడా ఉంది. మలబద్దకం సమస్య కూడా వస్తుంది. నిద్రలేమితో బాధపడే వారు ఖాళీ కడుపున టీ ని తాగడం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. కనుక ఖాళీ కడుపున టీ, కాఫీలను తాగడం అనేది మంచి అలవాటు కాదు. ఈ అలవాటు నుండి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది.