Eggs : ఆరోగ్యానికి కోడిగుడ్లు చాలా మేలు చేస్తాయని, ప్రతి ఒక్కరూ కూడా కోడి గుడ్లని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా కోడి గుడ్లని రోజూ తింటున్నారా..? అయితే కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. కోడిగుడ్లను తీసుకుంటే, పిల్లలు, పెద్దల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రోటీన్స్ కూడా బాగా అందుతాయి. ప్రతిరోజు కూడా మంచి పోషకాహారాన్ని తీసుకోవడం మంచిది. అయితే, ప్రతిరోజు కోడి గుడ్డుని తీసుకోవడం వలన కొన్ని సమస్యలు వస్తాయట.
ముఖ్యంగా అధికంగా కోడిగుడ్లని తినేవాళ్ళకి కొన్ని సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజూ ఎక్కువ కోడి గుడ్లని తింటే, మధుమేహం వస్తుందని అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ప్రతి రోజు కనీసం ఒకటి లేదా రెండు గుడ్లు తీసుకోవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. కానీ, బాగా ఎక్కువగా కోడిగుడ్లని తీసుకోవడం వలన మధుమేహం కలగొచ్చు. అయితే, ఎక్కువ కోడిగుడ్లు తీసుకోవడం వలన మధుమేహం వస్తున్నట్లు చెబుతున్నారు.
పురుషుల కంటే మహిళల్లో ఇది ఎక్కువగా వస్తున్నట్లు చెబుతున్నారు. పోషకాలు ఎక్కువగా గుడ్డులో ఉంటాయని చాలామంది కోడిగుడ్లని ఎక్కువగా తింటున్నారు. కానీ, బాగా ఎక్కువ గుడ్లు తీసుకుంటే, షుగర్ వస్తుందట. రోజుకు 38 గ్రాముల కంటే ఎక్కువ గుడ్డు తీసుకుంటే మధుమేహం ప్రమాదం 25 శాతం పెరుగుతుందని అధ్యయనాల ద్వారా వెల్లడవుతోంది.
50 గ్రాముల కంటే ఎక్కువ లేదా రోజుకి ఒక గుడ్డు కన్నా ఎక్కువగా తీసుకుంటే, మధుమేహం ప్రమాదం 60 శాతం పెరుగుతుందట. అయితే, ఆరోగ్యం కోసం కేవలం గుడ్డు మాత్రమే తీసుకోనక్కర్లేదు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి. పప్పులు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటివి కూడా ఉన్నాయి. కాబట్టి, వాటిని కూడా తీసుకుంటూ ఉండండి. కేవలం గుడ్డు ద్వారానే పోషకాలని మనం తీసుకోనక్కర్లేదు. కానీ పరిమిత మోతాదులో గుడ్లను తింటే ఏమీ కాదు. అధికంగా తింటేనే ప్రమాదం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. దీంతో గుడ్ల వల్ల అనేక లాభాలను పొందవచ్చు.