హెల్త్ టిప్స్

మ‌ట‌న్ తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..!

సాధార‌ణంగా కొంద‌రు ముక్క లేనిదే ముద్ద తిగ‌దు అనుకుంటారు. ఈ క్ర‌మంలోనే నాన్‌వెజ్ ప్రియులు ఎక్కువ‌గా మ‌ట‌న్‌ను ఇస్ట‌ప‌డుతుంటారు. అయితే మ‌రికొంద‌రు మటన్ తింటే ఫ్యాట్ వస్తుందని.. త్వరగా అరగదు అని.. ఆరోగ్యం దెబ్బ తింటుందని దీనికి దూరంగా ఉంటారు. కాని.. మ‌ట‌న్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. మటన్‌లో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. ఐరన్‌ ఉంటుంది. ఫ్యాట్‌ తక్కువ ప్రమాణాల్లో ఉంటుంది. మ‌రియు మటన్ లో బీ12 ఎక్కువగా ఉండడంతో శరీరంలో ఎర్రరక్తకణాలు ఏర్పడటానికి సహాయం చేస్తుంది.

అలానే దెబ్బతిన్న రక్తకణాల స్థానాల్లో కొత్తవి ఏర్పాటు చేయడానికి ఉపకరిస్తుంది. మటన్ గర్భిణులకు చాలా మంచిది. మటన్ లో సోడియం తక్కువ మోతాదులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందువలన మటన్ తినేవారిలో బీపీ, కిడ్నీ సమస్యలు తలెత్తవు.

if you are eating mutton then know this

అంతేకాదండోయ్‌.. సరైన మోతాదులో మటన్ తింటే ఇన్ఫెక్షన్లు, టైప్ 2 డయాబెటిస్ బారిన పడకుండా ఉండొచ్చు. మటన్ ను ఆహారంగా తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. మ‌రియు మటన్ తినేవారు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తక్కువ అని చెబుతున్నారు.

Admin

Recent Posts