ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరిపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఇల్లు, ఉద్యోగం, స్నేహితులు, సోషల్ మీడియా..ఇలా ఏవైపు నుంచయినా ఒత్తిడి ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే ఈ ఒత్తిడి నుంచి విముక్తి పొందడం ఎలా అన్నది చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య.
ఏ కారణం చేతైనా ఒత్తిడిగా ఉంటే నిద్రపోకుండా మరీ ఆలోచిస్తారు కొందరు. అలా చేస్తే.. పరిష్కారం దొరక్కపోగా మరింతగా ఒత్తిడి బారినపడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఏకాగ్రత కోల్పోయి పొరపాట్లు ఎక్కువగా చేస్తారట. అలాకాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు చెబుతున్నారు.
అందులో ముఖ్యమైంది నిద్ర.. కొద్దిసేపైనా హాయిగా నిద్రపోతే ఒత్తిడి ప్రభావం తగ్గుతుందట. చికాగ్గా, ఒత్తిడిగా అనిపించినప్పుడు చక్కెర, కెఫీన్ ఉన్న పదార్థాలను తక్కువగా తినాలి. ముఖ్యంగా శీతలపానీయాలు, చిప్ వంటివాటికి దూరంగా ఉండాలి. దానికి బదులు గాసు నీళ్లు తాగినా చాలు.
ఒత్తిడిని అధిగమించేందుకు స్నేహితులతో మాట్లాడుతుండాలి. కాసేపు దానం యోగా వంటివి చేయగలిగితే ఆ ఒత్తిడి నుంచి బయటపడతారు. సాధారణంగా పనులతో సతమతమవుతున్నప్పుడే ఒత్తిడి ఆవరిస్తుంది అనుకుంటాం. కానీ ఒక్కోసారి స లేనప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. ఇలాంటప్పుడు మీకోసం కొన్ని పనులు సంకల్పించుకోండి. అభిరుచులకు సమయం ఇవ్వండి.