సాధారణంగా ఈ కాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. నీళ్ళు ఎక్కువ తాగడం కూడా దీనికి కారణం అయ్యుండవచ్చు. ఐతే ఈ కాలంలో ఆకలి కారణంగా ఎక్కువ తింటుంటారు. దానివల్ల బరువు పెరిగిపోతుంటారు. మళ్ళీ ఆ బరువు తగ్గడానికి వ్యాయామాలు, తక్కువ తినడాలు చేస్తుంటారు. ఐతే ఈ కాలంలో ఏ ఆహారం తీసుకుంటే బరువు పెరగకుండా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం. గుడ్లలో కొవ్వుశాతం తక్కువగా ఉంటుంది. పొద్దున్నపూట బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా గుడ్లని తినడం వల్ల తొందరగా ఆకలి వేయకుండా ఉంటుంది. అలాగే బరువు పెరిగే అవకాశం కూడా ఉండదు. పాలకూరలో ఉండే పోషకాలు శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అంతే కాదు తొందరగా ఆకలి కలిగించకుండా ఉంటుంది.
దుంపలైన బీట్ రూట్, స్వీట్ పొటాటో మొదలగు వాటి వల్ల కొవ్వు పెరగకుండా ఉంటుంది. వారంలో ఒక మూడు సార్లైనా ఈ ఆహార పదార్థాలని తీసుకోవడం మంచిది. బరువు తగ్గడానికి ఏదైనా చిట్కా చెప్పండని ఎవరినైనా అడిగితే, వారిచ్చే సలహాల్లో ఓట్స్ తినాలని కచ్చితంగా ఉంటుంది. ఓట్స్ లో ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ అరగడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల తొందరగా ఆకలి వేయదు.
ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు కలిగిన క్వినోవాని ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కాలంలో తక్కువ కేలరీలు కలిగిన అధిక క్వినోవా బరువు పెరగకుండా సాయపడుతుంది. అవిసె గింజలు ఆకలిని అణచివేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. రోజుకి ఒక అరకప్పు అవిసె గింజలు తింటే చాలు కొవ్వు పెరగకుండా శరీర బరువు కంట్రోల్ లో ఉంటుంది.