హెల్త్ టిప్స్

కాలి పిక్క‌లు ప‌ట్టుకుపోతున్నాయా..? అయితే వీటిని తినండి..!

కండరాల తిమ్మిరి చాలా సాధారణమైన సమస్యే కావచ్చు, కానీ ఒక్కోసారి చాలా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ తిమ్మిరి తొడ వెనక‌ భాగంలో గానీ ముందు భాగంలో గానీ అవుతుంది. ఐతే ఇది కొన్ని సెకన్ల పాటు ఉంటుంది. అలానే వదిలేస్తే నిమిషాల పాటు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే తొడ కండరాలు తిమ్మిరి కలగకుండా చూసుకోవాలి. దీనికోసం కొన్ని ఆహారాలు బాగా పనిచేస్తాయి. అసలు ఈ కండరాలు ఎందుకు తిమ్మిరెక్కుతాయనేది ముందుగా తెలుసుకుందాం. ఎక్కువ వ్యాయామం చేయడం దీనికి ప్రధాన కారణం. నీరు సరిగ్గా త్రాగకపోవడం. సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్ వంటి ఖనిజాల లోపం ఏర్ప‌డ‌డం, కండరానికి గాయాలు కలగడం, ఎక్కువ చెమట బయటకు పోవడం, థైరాయిడ్, మూత్రపిండ సమస్యలున్నవారికి కండ‌రాలు ప‌ట్టుకుపోతుంటాయి. రాత్రి పూట ఇలా ఎక్కువ‌గా జ‌రుగుతుంది.

ఐతే ఈ సమస్య నుండి బయటపడేసే ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కండరాల తిమ్మిరి కలగడానికి ముఖ్య కారణం నీరు సరిగ్గా తీసుకోకపోవడమే. అందుకే పుచ్చకాయని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇందులో ఉండే అధిక శాతం నీరు, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరంలో రక్తప్రసరణని మెరుగుపరుస్తాయి. కొబ్బరి నీళ్ళలో ఉండే పొటాషియం, సోడియం, కాల్షియం వంటివి కండరాల తిమ్మిరి బాధనుండి బయటపడేస్తాయి. అంతే కాదు ఇందులో నీటిశాతం అధికంగా ఉంటుంది.

if you are having muscle cramps take these foods

వ్యాయామం చేసే ముందు అరటిపండు తినడం మంచిది. ఇందులో ఉండే ఖనిజాలు కండరాల తిమ్మిరి కలగకుండా చేస్తాయి. విటమిన్ ఎ, సి అధిక శాతం కలిగిన చిల‌గ‌డ‌దుంప‌ రోగ నిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. గాయాలు తగ్గడానికి ఇది బాగా పనిచేస్తుంది. కండరాల తిమ్మిరి తగ్గడానికి మేలు చేస్తుంది.

Admin

Recent Posts