హెల్త్ టిప్స్

Sleep Deprivation : రోజూ స‌రిగ్గా నిద్ర‌పోవ‌డం లేదా.. అయితే మీకు ఈ 10 న‌ష్టాలు త‌ప్ప‌వు..!

Sleep Deprivation : మనం ఆరోగ్యంగా ఉండడానికి, ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే ముఖ్యం. చాలామంది, సరిగ్గా రోజూ నిద్రపోలేకపోతుంటారు. నిద్రలేమి కారణంగా, రాత్రిపూట సతమతమవుతూ ఉంటారు. కానీ, నిజానికి నిద్ర అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. రోజూ సరిపడా నిద్ర ఉంటే, ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది. నిద్ర కనుక సరిగ్గా లేదంటే, ఆరోగ్యం పై అది బాగా ఎఫెక్ట్ అవుతుంది. రోజూ సరిపడా నిద్రపోవడానికి చూసుకోండి. నిద్ర సరిగా లేకపోతే, పలు సమస్యలు కలుగుతాయి. మరి నిద్ర సరిగ్గా లేకపోతే, ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.

సరిపడా నిద్ర లేకపోతే మెమరీ, కాన్సన్ట్రేషన్ తో పాటుగా పూర్తి కాగ్నిటివ్ పర్ఫామెన్స్ పై ప్రభావం పడుతుంది. మెదడు పనితీరు కూడా సరిగ్గా ఉండదు. ఏదైనా నేర్చుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. సరిపడా నిద్ర లేకపోతే ఇరిటేషన్, మూడు స్వింగ్స్ ఇలాంటివి కూడా ఎక్కువ అవుతాయి. సరిగా నిద్ర లేకపోవడం వలన, డిప్రెషన్ కి కూడా అది దారి తీయొచ్చు. సరిపడా నిద్ర లేకపోవడం వలన రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్లు, అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. సరిపడా నిద్ర చాలా ముఖ్యం.

if you are not sleeping well then you will get these 10 problems

ఇమ్యూన్ సెల్స్ పై ప్రోటీన్స్ ఫైట్ చేయగలగాలి. దానికి నిద్ర చాలా అవసరం. నిద్రపోలేకపోతున్న వాళ్ళు, బరువు పెరిగిపోతుంటారు. ఊబకాయం వంటి సమస్యలకి కూడా దారి తీయవచ్చు. ఈ సమస్యల నుండి డయాబెటిస్, హృదయ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవచ్చు. సరిగ్గా నిద్రపోలేకపోతున్నట్లయితే ఫిజికల్ పెర్ఫార్మన్స్ కూడా బాగా తగ్గిపోతుంది. క్రీడాకారులకి నిద్ర వలన ఎంతో నష్టం కలుగుతుంది.

నిద్ర సరిగ్గా లేకపోతే, బీపీ లో కూడా మార్పులు వస్తాయి. కార్డియా వాస్కులర్ సిస్టం సరిగ్గా పని చేయదు. నిద్ర సరిగ్గా లేకపోవడం వలన, చర్మం పై ముడతలు కూడా కలుగుతాయి. అందంపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. సరైన నిద్ర లేకపోవడం వలన, సెక్సువల్ యాక్టివిటీస్ మీద కూడా ఆసక్తి బాగా తగ్గుతుంది. ఇలా, నిద్ర లేకపోతే ఇన్ని నష్టాలు కలుగుతాయి చూసుకోండి.

Admin

Recent Posts