Nail Polish : పురుషులు ఏమోగానీ స్త్రీలు.. ముఖ్యంగా యువతులు నెయిల్ పాలిష్ వేసుకునేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది నెయిల్ పాలిష్‌లను తరచూ మారుస్తుంటారు. కొందరు అయితే రోజుకో నెయిల్ పాలిష్ వేసుకుని ఫ్యాషన్‌గా ఉన్నామని ఫీలవుతుంటారు. అయితే ఫ్యాషన్ పరంగా ముందు వరుసలో ఉన్నప్పటికీ ఆరోగ్యం పరంగా చూసుకుంటే నెయిల్ పాలిష్‌ల వల్ల ప్రమాదమే ఉంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. నెయిల్ పాలిష్‌ల వల్ల అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధల్లో తేలింది.
ప్రస్తుతం మనకు మార్కెట్‌లో దాదాపుగా అనేక వెరైటీలకు చెందిన నెయిల్ పాలిష్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ నెయిల్ పాలిష్ లోనైనా సరే.. ట్రైఫెనైల్ ఫాస్పేట్ అనే కెమికల్ ఉంటుంది. ఇది చర్మానికి అంటినప్పుడు మన శరీరంలోని హార్మోన్లు ప్రభావితం అవుతాయి. దీని వల్ల మనం అధికంగా బరువు పెరుగుతామని సైంటిస్టులు చెబుతున్నారు.
మార్కెట్‌లో అందుబాటులో ఉన్న 3వేల రకాలకు పైగా నెయిల్ పాలిష్‌లను సైంటిస్టులు పరీక్షించారు. ఈ క్రమంలో 49 శాతం వరకు నెయిల్ పాలిష్‌లలో పైన చెప్పిన కెమికల్ ఉందని తేల్చారు. దీంతో ఆ కెమికల్ ఉన్న నెయిల్ పాలిష్ వేసుకోగానే 10 నుంచి 14 గంటల్లో బరువు పెరుగుతారని సైంటిస్టులు తేల్చారు. డ్యూక్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. కనుక సైంటిస్టులు చెబుతున్నది ఒక్కటే.. నెయిల్ పాలిష్ వేసుకునే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని.. లేదంటే అధికంగా బరువు పెరుగుతారు. కనుక వాటిని వాడేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే మంచిది.