హెల్త్ టిప్స్

రాత్రి ఫోన్‌ను త‌ల ప‌క్క‌న పెట్టి ప‌డుకుంది.. అది ఒక్క‌సారిగా పేలింది..!

ప్రస్తుత టెక్నాలజీ కాలంలో ఒక పూట భోజనం లేకున్నా ఉంటారు కానీ ఒక్క క్షణం సెల్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. అరచేతిలో సెల్ ఫోన్ పెట్టుకొని ప్రపంచ నలుమూలల ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఎన్ని లాభాలు ఉన్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అలాంటి సెల్ ఫోన్ ని ఉదయం లేవడం నుంచి రాత్రి పడుకునే వరకు వారి వద్దనే ఉంటుంది. ఒక్క క్షణం ఫోన్ కనబడకపోతే గందరగోళం అయ్యే వ్యక్తులు కూడా ఉన్నారు.. మరి అలాంటి సెల్ ఫోన్ రాత్రి పడుకునే ముందు మన పక్కన పెట్టుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఒకసారి చూద్దాం..

ప్రస్తుత జనరేషన్ లో ఏ వ్యక్తి అయినా చివరి సారి పడుకునే ముందు చూసేది సెల్ ఫోనే.. అలాగే ఆ వ్యక్తి ఉదయం లేచే ముందు కూడా ముందు చూసేది సెల్ ఫోన్.. అది జీవితంలో ఒక భాగస్వామిగా అయిపోయింది.. ఈ విధంగా చాలామంది సెల్ ఫోన్ రాత్రి పడుకునే ముందు వారి తలగడ కింద పెట్టుకునే అలవాటు ఎంతోమందికి ఉంది.. అలా నిద్రించే ముందు మీరు కూడా మీ సెల్ ఫోన్ మీ తలగడ కింద పెట్టుకుంటున్నారా.. అయితే ఒక్కసారి ఈ ఘటన గురించి తెలుసుకోండి.. ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన గురించి తెలిస్తే మీరు కూడా భయాందోళనలకు గురవుతారు.. ఢిల్లీకి చెందిన ఒక మహిళ రాత్రి నిద్రించే సమయంలో తన స్మార్ట్ ఫోన్ ని తల పక్కనే పెట్టుకుని నిద్ర పోయింది. అర్ధరాత్రి సమయంలో ఆ ఫోన్ ఒక్కసారిగా పేలింది.

if you are putting your phone beside head while sleeping know this

దీంతో మహిళకు తీవ్రమైన గాయాలయ్యాయి.. దీంతో ఆ మహిళ తీవ్రమైన రక్తస్రావం లో ప్రాణాలు కూడా కోల్పోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వచ్చి చూడగా సెల్ ఫోన్ పేలి ఉండడం, ఆ మహిళ తలకు గాయాలై రక్తస్రావం కావడం సంబంధించిన ఫోటోలను తీసి ట్విట్టర్ వేదికగా ఎవరో పోస్ట్ చేశారు.. ఇది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది.. ఏది ఏమైనా సెల్ ఫోన్ ఎంత ఉపయోగకరం గా ఉంటుందో, అంతే ప్రమాదకరమైనది అని కూడా మనం గమనించాలి.. అది ఏ కంపెనీ ఫోన్ అయినా సరే ఒక ఎలక్ట్రానిక్ వస్తువే.. మనం దాన్ని ఏ విధంగా వాడుకుంటే అలాగే మనకు ఉపయోగం ఉంటుంది తప్ప అతి చేస్తే మాత్రం ఇలాంటి పరిణామాలు తప్పవని కొంతమంది టెక్నాలజీ నిపుణులు అంటున్నారు.

Admin

Recent Posts