Mattress : రోజూ ప‌రుపుల‌పై నిద్రిస్తున్నారా.. అయితే ఈ నిజాలను తెలుసుకోవాల్సిందే..!

Mattress : ప్ర‌స్తుత కాలంలో సుఖ‌మైన జీవితానికి అల‌వాటు ప‌డి చాలా మంది పరుపుల మీద నిద్రిస్తున్నారు. ప‌రుపు ఎంత మెత్త‌గా, ఎంత మందంగా ఉంటే అంత సుఖంగా నిద్రించ‌డానికి వీలుగా ఉంటుంద‌ని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ నిద్రించ‌డానికి ప‌రుపుల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. ప‌రుపుల త‌యారీలో ఫార్మ‌ల్డ్ హైడ్, బెంజీన్, నాఫ్త‌లీన్ వంటి వాటిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. వీటి వ‌ల్ల కళ్లు, ఊపిరితిత్తులు, చ‌ర్మానికి సంబంధించిన స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వారు చెబుతున్నారు. అల‌ర్జీలు, దుర‌ద‌లు, ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని వారు చెబుతున్నారు.

అలాగే నాఫ్తలీన్ వ‌ల్ల మూత్ర‌పిండాలు దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. అలాగే నాఫ్తలీన్ అనే ర‌సాయ‌నం కార‌ణంగా పొత్తి క‌డుపులో నొప్పి ఎక్కువ‌గా వ‌చ్చే ఉంద‌ని నిపుణులు జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. అలాగే బెంజీన్ వ‌ల్ల క‌డుపులో అల్స‌ర్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అలాగేఈ ర‌సాయ‌నం కార‌ణంగా క‌ణాల డి ఎన్ ఎ దెబ్బ‌తీన‌డం ఆరోగ్యంగా ఉండే క‌ణాలు క్యాన్స‌ర్ క‌ణాలుగా మార‌డం వంటివి జ‌రుగుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. స్పాంజి ప‌రుపులు వేడిని ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేస్తాయి. ఈ వేడి కార‌ణంగా ర‌సాయ‌నాలు విడుద‌లై గాలి ద్వారా నెమ్మ‌దిగా శ‌రీరంలోనికి వెళ్లి మ‌న మీద చెడు ప్ర‌భావాన్ని చూపిస్తాయ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. అలాగే పరుపుల్లో ఉండే కుష‌నింగ్ కార‌ణంగా వాటిపై మ‌నం ప‌డుకున‌ప్పుడు మ‌న శ‌రీర ఆకృతి మారుతుంది. దాని వ‌ల్ల డిస్క్ ల పై ఒత్తిడి ప‌డ‌డం, డిస్క్ లు వ‌త్త‌బ‌డ‌డం, డిస్క్ లు ప‌క్క‌కు జ‌ర‌గ‌డం జ‌రుగుతుంది.

if you are sleeping on Mattress daily then know these facts
Mattress

డిస్క్ లు ప‌క్క‌కు జ‌ర‌గ‌డం వ‌ల్ల న‌రాలు, వెన్నుపాముపై ఒత్తిడి ప‌డుతుంది. క‌నుక పూర్వ‌కాలంలో ఉప‌యోగించిన విధంగా దూది ప‌రుపుల‌ను ఉప‌యోగించ‌డం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. ప్ర‌స్తుత కాలంలో దూదితో త‌యారు చేసిన మెత్త‌టి ప‌రుపులు, మంచి నాణ్య‌మైన ప‌రుపులు మ‌నకు ల‌భిస్తున్నాయి. క‌నుక ఇలాంటి పరుపుల‌ను వాడ‌డం వ‌ల్ల ర‌సాయ‌నాలు విడుద‌ల అవ్వ‌కుండా ఉంటాయి. అలాగే మ‌నం వాటిపై మ‌నం ప‌డుకున్న‌ప్పుడు మ‌నం వెన్నుపూస ఆకృతి మార‌కుండా ఉంటుంది. దూదితో త‌యారు చేసిన ప‌రుపుల‌ను వాడ‌డం మంచిద‌ని వీటిని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి న‌ష్టం క‌ల‌గ‌కుండా ఉంటుంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

D

Recent Posts