Fish : చేపల కూరను మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నసంగతి మనకు తెలిసిందే. చేపలను తినడం వల్ల చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. చేపల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే మనలో చాలా చేపలను తిన్నప్పటికి చేప తలను పడేస్తూ ఉంటారు. దానిని కూరల్లో వేసుకోరు. చేప తలను తినడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అని చాలా మంది భావిస్తూ ఉంటారు. అసలు చేప తలను తినవచ్చా. తినకూడదా.. దీనిని తినడం వల్ల ఎటువంటి ప్రయోజం ఉండదా అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చేపతో పాటు చేప తలను తినడం వల్ల మనం మరిన్ని అధిక ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
చేప తల భాగంలో క్యాల్షియం, ఫాస్పరస్, ప్రోటీన్స్, జింక్, అయోడిన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు చేప తలను తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా చేప తలను తినడం వల్ల శరీరంలో అలాగే రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. గుండె సంబంధిత సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. చేప తలను తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కంటి సమస్యలు దూరం అవుతాయి. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు దూరం అవుతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు చేప తలను తినడం వల్ల చక్కటి నిద్రను సొంతం చేసుకోవచ్చు.
అంతేకాకుండా చేప తలను తినడం వల్ల శరీరానికి కావల్సినంత విటమిన్ డి లభిస్తుంది. అలాగే అధిక బరువు, అధిక పొట్ట వంటి సమస్యలతో బాధపడే వారు చేప తలను తినడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. అదే విధంగా దీనిని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు మన దరి చేరకుండా ఉంటాయి. వారానికి రెండు నుండి మూడు సార్లు చేప తలను, చేపలను తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇతర మాంసాహారాల కంటే చేపలే మన ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. అయితే వీటిని డీప్ ఫ్రై చేసి తీసుకోకూడదు. డీప్ ఫ్రై చేసి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు చేసే చేపలు అనారోగ్యానికి దారి తీస్తాయి. వీటిని ఉడికించి కూరగా తీసుకోవడమే మన ఆరోగ్యానికి మంచిది.