ఈ కూర‌గాయ‌ల‌ను మీరు త‌ర‌చూ తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

మ‌నం రోజూ అనేక ర‌కాల కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. కూర‌గాయ‌లు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు, శ‌క్తి అందుతుంద‌ని అలాగే కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. నిపుణులు కూడా అన్ని ర‌కాల కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. అయితే మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల‌తో పాటు మ‌నకు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చే కూర‌గాయ‌లు కూడా ఉంటాయి. అనారోగ్యాన్ని తెచ్చే కూరగాయ‌లా మ‌న‌లో చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పే కూర‌గాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న ఆరోగ్యానికి హానిని క‌లిగించే కూర‌గాయ‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌నం ఆహారంగా తీసుకునే వాటిలో క్యాప్సికం కూడా ఒక‌టి. వీటిని వివిధ ర‌కాల వంట‌కాల్లో వాడుతూ ఉంటాము. క్యాప్సికం మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయిన‌ప్ప‌టికి దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపులో మంట‌తో పాటు వివిధ అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవకాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో బ్ర‌కోలి కూడా ఒక‌టి. అయితే దీనిని తీసుకోవ‌డం వల్ల క‌డుపు ఉబ్బ‌రం మ‌రింత అధిక‌మువుతుంది. అలాగే థైరాయిడ్ స్థాయిలు కూడా పెరుగుతాయి. అలాగే మ‌న‌లో చాలా మంది బ్ర‌స్సెల్ స్ప్రౌట్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ఇవి చూడ‌డానికి చిన్న క్యాబేజిలా ఉంటాయి. అయితే ఇవి సుల‌భంగా జీర్ణం అవ్వ‌వు. దీంతో క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. అలాగే మ‌న‌లో కొంద‌రు నిల్వ ఉండే క్యాన్డ్ వెజిటేబుల్స్ ను తీసుకుంటూ ఉంటారు.

if you are taking these vegetables daily then must know these facts

కానీ వీటిని తీసుకోవ‌డం అంత మంచిది కాదు. వీటిలో ఉప్పు ఎక్కువ‌గా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. క‌డుపులో నొప్పి, కడుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. ఇక సెల‌రీని కూడా మ‌న‌లో చాలా మంది ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అయితే దీనిలో ఇత‌ర కూర‌గాయ‌ల కంటే పోష‌కాలు త‌క్కువ‌గా ఉండ‌డంతో పాటు దీనిలో క్రిమి సంహార‌క మందుల యొక్క అవ‌శేషాలు 68 ర‌కాలుగా పైగా ఉన్నాయ‌ని నిపుణులు జ‌రిపిన పిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. అలాగే మొక్క‌జొన్నను కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. మొక్క‌జొన్న చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు.మ‌న ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.

కానీ మొక్క‌జొన్న‌ను అధిక మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌డంతో పాటు బ‌రువు కూడా పెరుగుతారు. అలాగే బ‌ఠాణీలను తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతారు. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇక పిండి ప‌దార్థాలు ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో బంగాళాదుంప‌లు కూడా ఒక‌టి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్కెర స్థాయిలు పెరుగుతాయి. అధిక బ‌రువు స‌మస్య‌తో బాధ‌ప‌డే వారు వీటిని తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది. అలాగే వంకాయ‌ల‌ను కూడా అధికంగా తీసుకోకూడదు. ఇవి కూడా వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తాయి. క‌నుక ఈ ఆహారాలను వీలైనంత త‌క్కువ‌గా తీసుకోవాల‌ని జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్న వారు వీటిని వైద్యుల సూచ‌న‌ల మేర‌కు తీసుకోవ‌డం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts